AP politics: సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉంటూ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం ఏపీలో పరిస్థితిలో మరోలా ఉన్నాయి. ఎన్నికల సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తీవ్రస్థాయిలో దాడులు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
అల్లర్లను కట్టడి చేయడం కోసం పోలీసులు కంటిపై కునుకులేకుండా పోరాటం చేస్తున్నారు. ఇలా ఓటమి భయం పట్టుకోవడంతోనే ఇరువురు వర్గాలలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అల్లర్లు చోటు చేసుకుంటున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి మరింత రాజుకుంటుంది.
జూన్ 4వ తేదీ రాబోయే ఫలితాలలో గెలుపు ఎవరిది అనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఆతృత కనబరుస్తున్నారు. కేవలం మన రాష్ట్రంలో కాకుండా మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఏపీ ఎన్నికలపై ఎన్నో సందేహాలు ఏర్పడ్డాయి అక్కడ ఏ నాయకుడు మీడియా సమావేశంలో మాట్లాడిన వారికి తప్పకుండా ఏపీలో అధికారం ఎవరిది అనే ప్రశ్న ఎదురవుతుంది.
ఎవరొచ్చినా సఖ్యత ఉంటుంది..
తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడగా ఆయనకు కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. మీ అంచనాల ప్రకారం ఏపీలో ఎవరు రాబోతున్నారనే ప్రశ్న ఎదురవగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము వారితో చాలా సఖ్యతగా ఉంటాము. వారితో మాకు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కానీ నెగటివ్ థింకింగ్ ఉండదు. ప్రస్తుతం నేను నా తెలంగాణపై మాత్రమే ఫోకస్ పెట్టాను అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…