Comedian Sudhakar: వెండి తెరపై ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ సుధాకర్ ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈయన అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సుధాకర్ బయట ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఈయన చనిపోయారు అంటూ పెద్ద ఎత్తున ఈయన గురించి వార్తలు సృష్టించారు. ఈ విధంగా సుధాకర్ చనిపోయాడు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఏకంగా ఈ వార్తలపై ఆయనే స్పందించారు.
ఇలా తన గురించి తాను చనిపోయానంటూ వార్తలు వస్తున్నాయి కానీ నేను బ్రతికే ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇలా వయసు పై పడటంతో ఇంటిపట్టునే ఉన్నటువంటి సుధాకర్ మొదటిసారి బుల్లితెర షోలసందడి చేశారు. జూన్ 18వ తేదీ ఫాదర్స్ డే సందర్భంగా జీతెలుగు నిర్వహిస్తున్నటువంటి నేను నాన్న అనే కార్యక్రమంలో ఈయన సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సుధాకర్ కు వేదిక పైన ప్రత్యేకంగా సన్మానం చేయడమే కాకుండా తన చేత కేక్ కట్ చేయించి తన కుమారుడు తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సుధాకర్ సైతం అబ్బబ్బ అంటూ తన డైలాగ్ చెబుతూ అందరిని నవ్వించారు. ఇలా ఫాదర్స్ డే ను ఇంత గ్రాండ్ గా చేసినందుకు తాను సంతోషంగా ఉన్నాను అంటూ తెలియచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…