వేతనాల పెంపు, వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలంటూ ఇది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ ఇండియా, అల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మార్చి 11 నుంచి 13 వరకు మూడురోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. మార్చి 10న హోలీ సందర్భంగా బ్యాంకులకు హాలిడే… మార్చి14, సెకండ్ Satarday, ఆ తరువాతి రోజు (మార్చి 15) ఆదివారం కూడా సెలవు దినం. దీనితో బ్యాంకులు వరుసగా 6 రోజులు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ ప్రభావంతో మార్చి రెండవ వారంలో కేవలం 9వ తేదీన మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కాగా 20శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేస్తుంటే… 12.5 శాతం పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు సుముఖత చూపిస్తున్నాయి. అయితే తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఐదేళ్ల కొకసారి సేలరీలూ పెంచాలని, పే స్లిప్స్ పై 20శాతం పెంచాలని యూనియన్లు కోరుతున్నారు. వేతనాల పెంపు కోసం ఎన్ని సార్లు చర్చలు జరిపినా అవి సఫలం కాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు.
అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాదన మాత్రం మరోలా ఉంది. ఇప్పటికే వేతనాలలో 12.5 శాతం పెంపును అంగీకరిస్తున్నామని, పబ్లిక్ హాలిడేలు ఎక్కువగా ఉన్న దేశంలో ఐదు రోజుల పనిదినములు ఇవ్వడం సాధ్యపడదని, ఒకవేళ ఇస్తే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నదని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆరు రోజుల సెలవులు ఉన్నందున మీరు కాస్త అప్రత్తమై మీ లావాదేవీలు ఆ తేదీలోపు పూర్తిచేయడమో.. లేక పోస్టుపోన్ చేసుకోవడమో చేస్తే బెటర్.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…