General News

అక్టోబర్ నుంచి 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. సూది లేకుండానే టీకా..!

ఓ వైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనా కేసులు కూడా చాపకింద నీరులా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే 12 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ తీసుకునేవిధంగా కొన్ని దేశాలు అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నాయి. కానీ మన దేశంలో ఇప్పటి వరకు చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు అవకాశం ఇవ్వలేదు.

కానీ తాజాగా వైద్య నిపుణులు వారి కోసం గుడ్ న్యూస్ చెప్పింది. 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్​ Zycov-Dని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దేశంలో 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న పిల్లలు దాదాపు 12 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి టీకాలు అందుబాటులోకి వస్తాయని జైడస్ కాడిలా కంపెనీ తెలిపిందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా అన్నారు.

మొదట తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారికి ఇవ్వనున్నట్లు సమాచారం. తర్వాత వచ్చే సంవత్సరం మార్చి నుంచి మిగతా వారికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ తీవ్ర అనారోగ్యాల జాబితా సిద్ధం చేస్తుంది. ఆ జాబితా ప్రకారం పిల్లలకు టీకాలు ఇవ్వబడుతాయి.

2021 డిసెంబర్ చివరి నాటికి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. చిన్న పిలలకు ఇచ్చే ఈ టీకా మాత్రం మూడు డోసుల్లో ఇవ్వనున్నారు. ప్రతీ డోసుకు దాదాపు 28 రోజుల విరామం ఉండనున్నట్లు తెలిపారు. దీనికి సూది అవసరం లేకుండా టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago