“కరోనా వైరస్..” ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున వైరస్. మన దేశంలో కూడా సెంకడ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే మరికొందరు తమకు కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్యలు చేస్తుకున్నవారు మరికొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.
తాజగా ఆంద్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెడన గ్రామంలో ఇటువంటి విషాద ఘటన ఒకటి చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందినా లీలాప్రసాద్ (40), భారతీ (38) దంపతులు కాస్త అస్వస్థతకు గురికావడంతో.. వారికీ కరోనా సోకిందనే భయంతో తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతులిద్దరూ వారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా వచ్చినా కూడా వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నా కొందరు మాత్రం అనవసరమైన భయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తనువు చాలిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…