General News

కోవిడ్ కేర్ లో పెళ్లి.. ఎందుకు చేశారంటే?

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన ఆంక్షలను విధిస్తూ కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో ఎలాంటి శుభకార్యాలకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం పెళ్లి, చావు వంటి వేడుకలకు కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ఎన్నో జంటలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వివాహాలు జరిపించారు. ఈ క్రమంలోనే ఓ జంట ఏకంగా కోవిడ్ కేర్ సెంటర్ నే వివాహ వేదికగా చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండలేరు.

ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపును ప్రకటించింది. ఈ క్రమంలోనే వివాహ వేడుకలకు విధించిన ఆంక్షలను కూడా సడలించారు.దీంతో పార్నర్ పట్టణానికి చెందిన రెండు జంటలు కోవిడ్ సెంటర్‌లో వివాహం చేసుకొని ఒక్కటైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంతో పెద్ద చదువులు చదివిన ఈ జంటలుఎంతో ఘనంగా తమ పెళ్లిని చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి తమ పెళ్లి ఖర్చులన్నీ పూర్తిగా తగ్గిస్తూ ఎంతో నిరాడంబరంగా కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకుని, పెళ్లికి అయ్యే ఖర్చునంతటిని ఆ కోవిడ్ కేర్ సెంటర్ కు విరాళంగా ప్రకటించారు.స్థానిక ఎమ్మెల్యే నీలేష్ లంకకు చెందిన శరద్ చంద్రజీ పవార్ ఆరోగ మందిర్ కోవిడ్ సెంటర్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్ లో అనికేత్ వ్యవహరే, ఆర్తి షిండే…రాజశ్రీ కాలే, జనార్దన్ అనే రెండు జంటలు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి ఖర్చులు తగ్గించడం వల్ల ఆ డబ్బులతో మాస్కులు, శానిటైజర్ లు, పీపీఈ కిట్లు మందులు కొనుగోలు చేసి ఇవ్వడమే కాకుండా .37000 ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ క్రమంలోనే ఈ జంటలు మాట్లాడుతూ తాము అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కరోనా బాధితులకు ఎంతో ధైర్యం కలుగుతుందని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కొంతవరకు తమ వంతు సాయం ప్రకటించినట్లు అవుతుందని ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.ఈ విధంగా ఈ యువకులు కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకోవడం వల్ల ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్ల చేత ప్రశంశలు అందుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago