Featured

Cricketer Yuvaraj Singh : గ్రౌండ్ లో రక్తం కక్కుకున్నా పోరాడి గెలిచిన ధీరుడు… క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్…!

Cricketer Yuvaraj Singh : ఇండియాలో ఏ ఆటకు ఎంత క్రేజ్ ఉన్నా క్రికెట్ కి మాత్రం ఫుల్ క్రేజ్. చిన్న పిల్లల దగ్గరినుండి ముసలివాళ్ళ వరకు అందరూ క్రికెట్ వస్తే టీవీకి అతుక్కుపోతారు. ఇప్పుడంటే t20 లు, ఐపీఎల్ మ్యాచ్లు వచ్చాయి కానీ అంతకుముందు వన్డే మ్యాచ్చులు, టెస్టు సిరీస్ లు అందులోనూ దాయాది దేశం పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. అలాంటి క్రికెట్ అంటే ఎంతో అభిమానించే ఇండియాకు ఆ క్రికెట్ ఆడే ఆటగాళ్ళను అంతే అభిమానిస్తారు. క్రికెట్ దేవుడు అంటే సచిన్, ఇక హెలికాప్టర్ షాట్స్ అంటే ధోని ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఆటగాడంటే ఇష్టం. అలా చాలా మంది ఇష్టపడే ఆటగాళ్లలో ఒకడు యూవి. యువరాజ్ సింగ్ నే అభిమానులు ముద్దుగా యూవి అని పిలుచుకుంటారు. ఈ పంజాబీ ఆటగాడు పడి లేచిన కెరటం. ఆటలో ఎన్నో రికార్డులను సాధించడంతో పాటు జీవితంలోనూ అతి పెద్ధ శత్రువైన క్యాన్సర్ ను జయించాడు.

గ్రౌండ్ లోనే రక్తం… అధైర్యం పడని యూవి…

యూవి తండ్రి యోగ్ రాజ్ సింగ్ కూడా క్రికెటర్. ఆయన మాజీ బౌలర్ గా ఇండియన్ క్రికెట్ కి సేవలందించారు. ఆయన పంజాబీ సినిమాల్లో నటించారు కూడా. ఇక యూవి పుట్టిన కొద్ది కాలానికే యూవి తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి వద్దే పెరిగిన యూవికి మొదట క్రికెట్ అంటే ఇష్టముండేది కాదు. ఇతర ఆటల్లో చురుగ్గా ఉండే యూవి కొద్దికాలానికి తండ్రి బలవంతం మీద క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు. అయిష్టంగానే క్రికెట్ నేర్చుకోవడం మొదలు పెట్టిన యూవి బౌలర్ అవుతాడని తండ్రి భావించినా బ్యాటింగ్ వైపు యూవి మల్లాడు. అలా 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యువరాజ్ సింగ్ . 2007 ప్రపంచ కప్ క్రికెట్లో ఇంగ్లాండుకు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు యూవి.

2007 టి20 ప్రపంచ కప్ లో ప్రధాన బ్యాట్సమన్ గా ఇరగదీసిన యూవి, 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. టి20 పొట్టి క్రికెట్లో 12 బంతుల్లో అర్ధ శతకం సాధించి రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో అల్ రౌండర్ అత్యుత్తమ ప్రదర్శన యువి ఖాతాలోనే వుంది. ఇన్ని రికార్డులు సృష్టించిన యూవి జీవితంలో అతి పెద్ధ శత్రువైన క్యాన్సర్ బారిన 2011 లో పడ్డాడు. గ్రౌండ్ లోనే రక్తం కక్కుకున్న యూవి క్యాన్సర్ చికిత్స తీసుకుని కోలుకున్నాక మళ్ళీ ఇండియన్ క్రికెట్ లోకి పునరాగమనం అయ్యాడు. ఇక 2019 లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన యూవి క్యాన్సర్ అవగాహన ప్రోగ్రామ్ ‘యూ వీ కెన్’ అనే స్వచ్చంద సంస్థ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago