CVL Narasimha Rao : ఠాగూర్ సినిమాకు నన్ను వాడుకొని.. చివరికి సినిమా రిలీజ్ అయ్యాక ఎంత మోసం చేసారంటే.. : సీవీఎల్ నరసింహారావు

CVL Narasimha Rao : విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన సీనియర్‌ ఆర్టిస్ట్‌ సీవీఎల్‌ నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి సీక్రెట్ ను అతడే బయట పెట్టి సినిమాకు ఓ కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే ఇదిలా ఉండగా.. అతడు ఠాగూర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడారు. అతడు ప్రొఫెషన్ గా ఒక లాయర్.. లాయర్లు సాధారణంగా మోసపోరు కదా.. మీరెప్పుడైనా మోసపోయారా అని అతడిని ప్రశ్నించగా.. ఒక స్కూటర్ విక్రయించే విషయంలో మోసపోయినట్లు చెప్పిన అతడు.. మరో మోసం గురించి కూడా చెప్పారు.

రక్ష అనే ఆర్గనైజేషన్ పెట్టి 25 ఏళ్లు అయిందని.. దానిలో యాంటీ కరెప్షన్ వింగ్ లో రిటైర్డ్ డీజీపీతో ఒక సంవత్సరం వరకు నడిపినట్లు తెలిపారు. ఠాగూర్ సినిమా రావడానికి రెండు సంవత్సరాల ముందు ఇలా నడిపామని.. దానిలో ఎలాంటి అవినీతి ఉండకూడదని అనేది మెయిన్ థీమ్. అయితే ఠాగూర్ సినిమా సమయంలో ప్రొడ్యూసర్స్, వివి వినాయక్ తో కలిసి దీనికోసం ఒక వెబ్ సైట్ చేద్దామని అనుకున్నాం… దాని పేరు కూడా ‘ఫర్ యూ’ అని కూడా అనుకున్నామని చెప్పారు.

దానితో జనాలకు సేవ చేయడానికి వీలు ఉంటుందని అనుకున్నారట. దాని ఆధారంగానే ఠాగూర్ సినిమా తీసామని.. తీరా సినిమా రిలీజ్ అయి మొదటి షో పడగానే.. వెబ్ సైట్ గురించి మాట్లాడితే.. ఇక అలాంటిది ఏమి అవరసం లేదని, సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది ఇంకా పబ్లిసిటీ తో పనేముంది అని మోసం చేశారని నరసింహారావు చెప్పుకొచ్చారు. ఇలాంటిదే యువసేన సినిమాకు కూడా జరిగిందని ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.