CVL Narasimharao : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన తెలుగు నటుడు నరసింహారావు గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న వివిధ విషయాల గురించి రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన వృత్తిపరంగా లాయర్ అయినా సినిమాల్లో ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక లాయర్ అయ్యుండి కూడా కొన్నిసార్లు మోసపాయాను డబ్బు విషయలో అలాగే ఎదుటివారి ఆలోచన పసిగట్టడంలో మోసపోయాను అంటూ చెప్పారు. వెంకీ, జాతిరత్నాలు, ఠాగూర్, యువసేన వంటి ఎన్నో సినిమాల్లో నటించారు.
ఠాగూర్ సినిమాలో అలా మోసం చేసారు…
చిరంజీవి గారు హీరోగా లంచగొండితనం మీద వచ్చిన సినిమా ఠాగూర్. సమాజానికి మేల్కొల్పు లాగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. అలాగే చిరంజీవి గారికి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఒకరకంగా ఈ సినిమా కారణం అయింది. ఇక సినిమా విషయంలో జరిగిన ఒక సంఘటన గురించి నరసింహారావు గారు వివరించారు. సినిమాలో నటించడం వల్ల అప్పటికే సమాజానికి ఉపయోగపడే ఏవో ఒక కార్యక్రమాలు చేస్తున్న నరసింహారావు గారు ఈ సినిమా ద్వారా కూడా ఏదైనా చేయాలని అనుకోని లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఒక వెబ్ సైట్ ను మాజీ డీజిపి వంటి వారి సహాయంతో చేసారు. అయితే సినిమా విడుదల అయ్యే వరకు ఆ సినిమా నిర్మాతలు ఆ వెబ్ సైట్ కోసం ప్రోత్సాహం ఇచ్చి సినిమా హిట్ అవ్వగానే వెబ్ సైట్ ను వదిలేసారు.
ఏమని అడిగితే సినిమాకు పబ్లిసిటీ వస్తుందని వెబ్ సైట్ పెట్టాము, ఇక సినిమా హిట్ అయింది కదా ఇంకెందుకు వెబ్ సైట్ అంటూ మాట్లాడారు. అంటే సినిమా హిట్ అవ్వడానికి దోహద పడుతుందని వెబ్ సైట్ కి సహాయం చేసారా ఇలా కూడా మోసం చేస్తారా అనిపించింది. శర్వానంద్ నటించిన స్రవంతి రవికిశోర్ యువసేన సినిమా సమయంలో కూడా ఇలాగే జరిగింది. కాకపోతే ఇక్కడ సినిమా ఫ్లాప్ అవడంతో ఇంకా వెబ్ సైట్ ఎందుకు సినిమానే పోయినపుడు అన్నారు. అలా లాయర్ అయ్యుండి ఈ రెండు సందర్భలోనూ వాళ్ళ ఇంటెన్షన్స్ కనుక్కోలేకపోయాను అంటూ చెప్పారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…