Dasara: ఓటీటీలో సందడి చేయనున్న నాని దసరా…. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే?

Dasara: నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక వసూలు రాబట్టిన ఈ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది.

ఈ సినిమా విడుదలై ఇప్పటికే 15 రోజులు గడిచినప్పటికీ ఈ సినిమా హవా మాత్రం తగ్గటం లేదు ఇప్పటికి థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తూ వసూళ్లు సాధిస్తుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఈ సినిమా లో నాని అద్భుతమైన నటనకు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఇక మహానటి సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తీ సురేష్ ఈ సినిమాలో డీ – గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా సక్సెస్ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం ప్రతిభ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే తన సత్తా నిరూపించుకున్నాడు. ఇంతకాలం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులలో అలరించడానికి సిద్ధమయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మే 30 నుండి దసరా సినిమా ఓటీటీ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

Dasara:భారీ ధరలకు డిజిటల్ రైట్స్…

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 30 వ తేది నుండి దసరా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో ప్రేక్షకులను సందడి చేసిన దసరా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆధారపడి పొందుతుందో తెలియాల్సి ఉంది.