Jabardasth comedian Ganapathi : జబర్దస్త్ ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. చాలా మందో కెరీర్ లో బాగా స్థిరపడ్డారు. కేర్ అఫ్ లేనివాళ్ళను సెలబ్రిటీలను చేసేసింది ఈ కామెడీ షో. అలానే సెలబ్రిటీ అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి గణపతి. ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ మరో వైపు జబర్దస్త్ చేసిన గణపతి ఆ ప్రోగ్రమ్ తో బాగా ఫేమస్ అయి ఏకంగా మంచి సినిమా ఛాన్స్ లను అందుకున్నారు. అయితే అంతకంటే ముఖ్యంగా ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారిపోయారు గణపతి.
టీచర్ అయ్యాక నా చిరకాల కల నెరవేరింది…
గణపతి గారు 1998 డిఎస్సి నోటిఫికేషన్ లో పరీక్ష రాసినా ఎపుడూ టీచర్ ఉద్యోగం రాలేదు. అయితే ఆ నోటిఫికేషన్ లో అవకతవకలు జరిగడంతో నియామకాలు ఆగిపోయాయి. చివరికి తాజాగా జగన్ సర్కార్ ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హత ఉన్న వారికి ఉద్యోగాలను ఇచ్చారు. అలా గణపతి గారికి గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోనే ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గణపతి గారు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తారా అనే ప్రశ్నకు వస్తానని హాలిడేస్ అలా ఉన్న సమయంలో ఖచ్చితంగా సినిమాల్లోనూ జబర్దస్త్ లోనూ కనిపిస్తానంటూ చెప్పారు. ఇక హైపర్ ఆది, మిగిలిన కమెడియన్స్ అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారని వాళ్లంతా చాలా సంతోషించారంటూ చెప్పారు. తాజాగా విడుదల అయిన శాకుంతలం సినిమాలో నటించిన గణపతి గారు త్వరలో రామ్ చరణ్ నటిస్తోన్న శంకర్ గారి సినిమాలో నటించానని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…