Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు కారణం ఆ డైరెక్టరే… భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!
Dhanush – Aishwarya Divorce: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒకప్పుడు విడాకులు అనే వ్యవహారం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్,టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినీ సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే గత కొన్ని నెలల క్రితం సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా వీరి విడాకుల గురించి మరిచిపోక ముందే మరొక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్యల విడాకుల గురించి అధికారికంగా ప్రకటన చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది 18 సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట ఉన్నఫలంగా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం పై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కొంతమంది నెటిజన్లు నాగచైతన్య సమంత, ధనుష్ ఐశ్వర్య జంటలు విడాకులు తీసుకోవడానికి గల కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల అయిన వెంటనే నాగచైతన్య సమంత దంపతులు విడాకుల ప్రకటన చేశారు.ఈ క్రమంలోనే హీరో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక పూర్తిస్థాయి తెలుగు చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఈ జంట కూడా విడాకులు తీసుకోవడంతో వీరు విడాకులకు శేఖర్ కమ్ములకి కనెక్షన్ ఉంది అంటూ పెద్దఎత్తున డైరెక్టర్ శేఖర్ కమ్ముల పై ఇదెక్కడి కో-ఇన్సిడెన్స్ అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…