Categories: FeaturedMovie News

Dhee show Harinath Reddy Master : ఢీ షోలో జరిగే మోసాలను బయటపెట్టిన హరినాథ్ రెడ్డి మాస్టర్… 15 ఏళ్ల తరువాత తనపై జరిగిన కుట్రలు మోసాలను బయటపెట్టిన హరినాథ్ రెడ్డి మాస్టర్…!

Dhee show Harinath Reddy Master : తెలుగు బుల్లితెర మీద డాన్స్ షోస్ లో నెంబర్ వన్ అంటే ఢీ షో గుర్తొస్తుంది. ఇప్పటికీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ షో మొదటి సీజన్ అయితే ఫుల్ హైప్ తో టాప్ రేటింగ్స్ తో దుసుకుపోయింది. ఈ మధ్య ఢీ షోలో కామెడి స్కిట్స్ అంటూ పెట్టి రేటింగ్స్ కోసం కష్టపడుతున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఈ షోకి మంచి రేటింగ్స్ ఉండేవి. సీజన్ వన్ అయితే ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. ఇక ఆ సీజన్ లో విన్నర్ గా నిలిచిన హరినాథ్ రెడ్డి గారిని ఎవరూ మర్చిపోలేరు. అయితే ఢీ పలు సీజన్స్ లో పాల్గొన్న ఆయన మళ్ళీ మీడియాకు కనిపించలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కనిపించిన ఆయన ఢీ షో అలాగే మరికొన్ని డాన్స్ షోల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ఢీ లో జరిగిన అవమానాలు…

ఢీ మొదటి సీజన్ లో విన్నర్ గా నిలిచిన హరినాథ్ రెడ్డి ఢీ షో గురించి మాట్లాడుతూ మొదటి సీజన్ తరువాత సినిమాల్లో డాన్స్ మాస్టర్ గా అవకాశాలు వచ్చినా కోరియోగ్రాఫర్ గా కార్డు తీసుకోవాలని తెలియక పోవడం వల్ల ఆఫర్స్ కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఢీ మొదటి సీజన్ అయ్యాక రెండో సీజన్ అపుడు చేస్తానని చెబితే వద్దని వెంటనే మళ్ళీ వస్తే జనాలు బోర్ ఫీల్ అవుతారు అంటూ చెప్పారు. ఆర్థిక అవసరాల కోసం అడిగాను అయితే సీజన్ మధ్యలో కాల్ చేసి రమ్మని పిలిచారు. వెళ్ళాక ఆల్రెడీ ఉన్న మాస్టర్లు నన్ను అంగీకరించలేదు.

నన్ను కంటెస్టెంట్ గానే తీసుకున్నారు. ఆ సమయంలో చాలా అవమానించారు. నేనుండకూడదని చాలా పట్టుబట్టడంతో నన్ను ఎలిమినేట్ చేసారు. ఇక మళ్ళీ ఢీ సిక్స్ సీజన్ లో కూడా నన్ను పిలిచారు. అపుడు మాస్టర్ గా పిలిచినా మధ్యలోనే పాలిటిక్స్ జరిగి ఎలిమినేట్ చేసారు. షో మేనేజ్ మెంట్ కి ఎలాంటి పాలిటిక్స్ తెలియవు. మధ్యలో ఉండే వాళ్ళే ఇవన్నీ చేస్తారు అంటూ పైగా నన్ను ఎలిమినేట్ చేస్తున్నట్లు ఒక ఎపిసోడ్ ఉండదు వెళ్ళిపోమన్నారు. ఇలా ఎన్నో జరిగాక ఢీ షో చేయకూడదని అనుకున్నాను అంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నట్లు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago