రూ.50లక్షలు గెలుచుకున్న సన్నీకి ట్యాక్స్ పోను అతడి చేతికి వచ్చేది ఎంతో తెలుసా..?

భారత్ లో ఒక లాటరీ గెలుచుకున్నా.. రియాల్టీ షోలల్లో ఫ్రైజ్ మనీ గెలుచుకున్నా చేతికి అందేది మొత్తం అమౌంట్ ఉండదు. అందులోదాదాపు 31.2 శాతం ట్యాక్స్ కింద కట్ అవుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న సన్నీ విషయంలో కూడా అంతే.

అతడికి ప్రైజ్ మనీ కింద రూ.50 లక్షలను బిగ్ బాస్ విజేతగా కల్పించారు.అయితే అతడికి అందులో వచ్చేది కేవలం రూ.34.40 లక్షలు మాత్రమే. అతనికి వచ్చిన రూ. 50 లక్షల్లో.. రూ. 15.60 లక్షలు ఇన్కమ్ టాక్స్ కట్ అయినట్టు తెలుస్తుంది. ఏదైనా షోలో పాల్గొన్నప్పుడు రూ.10 వేల కంటే ఎక్కువ గెలిస్తే అందులో 31.2% టాక్స్ చెల్లించాల్సి ఉంటుందట.

అంతే కాదు ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించిన మీలోఎవరు కోటీశ్వరులు లో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా రూ.ఒక కోటి గెలుచుకున్నాడు. అతడి ప్రైజ్ మనీలో కూడా 31.2 శాతం ట్యాక్స్ కట్ అయింది.
ఇక సన్నీ ప్రైజ్ మనీ కాకుండా వారానికి రూ.లక్ష చొప్పున ఒప్పుకున్నాట. దీంతో అతడిని 15 వారాలకు గాను రూ.లక్ష రూపాయల చొప్పున రూ.15లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో మొత్తం అతడు రూ.25లక్షలు విలువ చేసే ప్లాట్, రూ.50 లక్షలు మరియు రూ.15లక్షలు మొత్తంగా రూ.90 లక్షల వరకు సన్నీ గెలుచుకున్నాడు. అయితే సన్నీ ఓవరాల్ ప్రైజ్ మనీతో పోల్చితే.. యాంకర్ రవి ప్రైజ్ మనీ కూడా సమానంగా కనిపిస్తుంది. అతడు 12 వారాలకు గాను అత్యధిక పారితోషికం తీసుకున్నాడు. రూ.90లక్షల వరకు యాంకర్ రవి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.