త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న విజయ్ దేవరకొడ, నేషనల్ క్రష్ రష్మికా గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూరే విధంగా వీళ్లిద్దరు ముంబైలో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ డేట్ చేసి బయటకు వస్తున్నక్రమంలో అక్కడే ఉన్న కెమెరాలకు చిక్కారు. వాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అక్కడ మొదట విజయ్ దేవరకొండ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి తన కారులో కూర్చోగా.. అతడి వెనకాల నుంచి వచ్చిన రష్మిక వెళ్లి అతడి కారులోనే కూర్చుంది. ఇక ఈ వీడియోలనకు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ మై గాడ్.. క్రష్మిత మరియు ప్రేమకొండ. ఈ సౌత్ జోడి అలియా మరియు రన్‌బీర్‌ల జోడీని తలపిస్తోందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
త్వరలోనే వీళ్ల ప్రేమ విషయం బయటపెడతారని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక వీరిద్దరు జంటగా నటించిన సినిమాలు రెండు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈక్రమంలో తెరపై హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్, రష్మిక డేటింగ్‌లో ఉందని అంటున్నారు.
వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, వీరి మధ్య ఏదో నడుస్తోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్, రష్మిక ఒకానొక సందర్భంలో తమపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ అవన్నీ పుకార్లేనని.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పారు. ఇక.. త్వరలో విడుదల కానున్న మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక కనిపించనుండగా.. విజయ్ ‘లైగర్’ విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇందులో అనన్య పాండే మరియు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…