KGF Director: కేజిఎఫ్ డైరెక్టర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి సమీప బంధువని మీకు తెలుసా?
KGF Director: కేజిఎఫ్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ చలన చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేజిఎఫ్ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కేజిఎఫ్ 2తో మరింత గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు.ఇలా ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిరలోని నీలకంఠపురం గ్రామానికి చెందినవారు. అంతేకాదండోయ్ ప్రశాంత్ నీల్ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి సమీప బంధువు కూడా. ఇంతకీ రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ వరుసకు ఏమి అవుతారనే విషయానికి వస్తే..
ప్రశాంత్ తండ్రి నీలకంఠాపురం సుభాష్ రెడ్డి. ఈయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి తండ్రికి తమ్ముడి వరస అవుతారు. ఈ విధంగా చూసుకుంటే రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. ప్రశాంత్ నీల్ తండ్రి కర్ణాటకకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడంతో వీరి కుటుంబం మొత్తం కర్ణాటకలోనే సెటిల్ అయ్యారు అంతే కానీ ప్రశాంత్ నీల్ నిజానికి తెలుగువారని తెలియడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…