కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు అంటారు. తన భాగస్వామి ఎవరు అవుతారనేది చాలామంది ఊహించలేరు. సంబంధం కుదిరిన తర్వాతనే వాళ్ల గురించి తెలుకుంటారు. అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న జంటను చూశారా.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అయ్యారు. అదేంటి.. మైనర్లకు పెళ్లి చేయకూడదు కదా.. వాళ్లిద్దరని చూస్తుంటే ఇంకా 10 సంవత్సరాలు కూడాదాటలేదు.. అప్పుడే పెళ్లి చేశారేంటి అనే అనుమానం కచ్చితంగా వస్తుంది.
అక్కడికే వస్తున్నా.. విషయం ఏటంటే.. వాళ్లిద్దరు మైనర్లు కాదు.. ఇద్దరూ మేజర్లే. ఇద్దరికీ కూడా 25 ఏళ్లకు పైగానే వయస్సు ఉంది. అందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు విష్ణు, ఆమె పేరు జ్యోతి. అతడికి 28 ఏళ్లు, ఆమెకు 26 ఏళ్లు. అతడు బెంగుళూరు వాసి.. ఆమె కోలారుకు చెందిన యువతి.
వారిద్దరూ కూడా బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే జీన్స్ సమస్యల కారణంగా వాళ్ల శరీరం పెరగకుండా అలా మందగించింది. అందుకే మనకు వాళ్లు అలా కనిపిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఏ నాడు వాళ్లు పొట్టిగా ఉన్నారని బాధపడలేదట.. ఎగతాళి చేస్తున్నా.. పట్టించుకునే వారు కాదట.. వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గకుండా ఇలా ముందుకు సాగారు.
ఇద్దరూ కూడా ఒకరినొకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చింతామణి దగ్గరున్న కైవార క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీళ్ల పెళ్లిక సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. నిజంగా వారి ఆత్మ విశ్వాసానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…