Featured

Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్…?

Sapthagiri: కమెడియన్ సప్తగిరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రం ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన సప్తగిరి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా సప్తగిరి థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతూ డైరెక్టర్ మారుతి చేతికి చిక్కాడు. ఈ క్రమంలో మారుతి సప్తగిరికి చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది.

Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్…?

సప్తగిరి నిజంగా థియేటర్ వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడని నమ్మితే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టే. అవునండి ఇదంతా కేవలం సినిమా టికెట్ల రేట్ల గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వటానికి ఈ విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్క కమర్షియల్ సినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా టికెట్ల రేటు గురించి ప్రేక్షకులలో సందేహాలు ఉన్నాయి.

Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్…?

ఈ క్రమంలో ఈ వీడియో ద్వారా టికెట్‌ రేట్స్‌ పై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో కమెడియన్ సప్తగిరి థియేటర్ వద్ద 150 రూపాయలకు బ్లాక్ టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో సినిమా టికెట్లు బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావు అని మారుతి అడగ్గా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవిగారి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రమోషన్ లో భాగమే…

బ్లాక్ లో ఒక టికెట్ ఎంతకీ అమ్ముతున్నావు అని మారుతి అడగ్గా..150 అని సప్తగిరి చెప్పాడు. అదేంటంటే కౌంటర్లో కూడా 150 కే టికెట్ ఇస్తున్నారు కదా. సినిమా ప్రమోషన్స్ లో కూడా బన్నీ వాసు గారు క్లియర్ గా చెప్పారు కదా పాత రేట్లకే ఈ సినిమా టికెట్ రేట్లు ప్రేక్షకులకి అందుబాటులో ఉంటాయని… నువ్వు వినలేదా అని అన్నాడు. నిజంగా పాత రేట్లకు ఈ సినిమా చూడచ్చా సార్ అని సప్తగిరి అంటాడు. ఈ “పక్కా కమర్షియల్” సినిమా టికెట్లను నాన్ కమర్షియల్ రేట్లకే ప్రేక్షకులకు అందజేస్తున్నాం అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago