Featured

Director Pavan Sadineni : రాజేంద్ర ప్రసాద్ తో సినిమా చేస్తున్నావ్… ఇక నీ పని అయిపోయింది అని చాలా మంది అన్నారు…: దర్శకుడు పవన్ సాధినేని

Director Pavan Sadineni : ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఒక్కసారి తనవైపు ఇండస్ట్రీ చూసేలా చేసుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని. విజయవాడ కు చెందిన పవన్ సాధినేని అమెరికా వెళ్లి తల్లిదండ్రుల కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తన ఇష్టాన్ని వదులుకోలేక షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. అలా మంచి వ్యూస్ అందుకున్న పవన్ ఆ పైన సినిమాలను డైరెక్ట్ చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆపైన సావిత్రి లాంటి ఫ్లాప్ అందుకున్నా సేనాపతి సినిమాతో మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ అందుకుని తాజాగా జేడి చక్రవర్తి మెయిన్ లీడ్ గా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మంచి హిట్ అందుకున్నాడు. త్వరలోనే పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్న పవన్ సాధినేని తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

రాజేంద్ర ప్రసాద్ తో చేసినపుడు అందరూ బయపెట్టారు…

మొదటి సినిమా తరువాత సావిత్రి సినిమా రూపంలో ఫెయిల్యూర్ చుసిన పవన్ సాధినేని ఆ సినిమా వైఫల్యం నుండి చాలా నేర్చుకున్నాను అంటూ చెబుతాడు. అలా సేనాపతి సినిమా తీసి మళ్ళీ మంచి విజయం అందుకున్న పవన్ సాధినేని దయ సిరీస్ తో తాజాగా మంచి విజయం అందుకున్నాడు.

అయితే సేనాపతి సినిమా టైం విశేషాలను ఇంటర్వ్యూలో చెబుతూ సేనాపతి సినిమాను రాజేంద్ర ప్రసాద్ గారితో తీస్తున్నానని చెప్పగానే చాలా మంది ఆయనతోనా, చాలా కష్టం, అయిపోయావ్ నువ్వు అంటూ భయ పెట్టారు. కానీ ఒక్కసారి ఆయనతో పని మొదలు పెట్టాక తెలిసింది. అయన అసలు వాళ్లందరూ చెప్పినట్లు కాదు అంటూ పవన్ తెలిపారు. ఆయన షూటింగ్ కి టైంకి వస్తారు అలాగే స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం వేలు పెట్టరు అంటూ పవన్ తెలిపారు.

Bhargavi

Recent Posts

టెన్షన్ ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుందా..? జీవనశైలిలో దాగి ఉన్న అసలు కారణాలు

ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య చాలా సాధారణంగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా…

7 minutes ago

చలువ ఇస్తుందని అనుకుంటే తప్పే.. పుదీనా వెనుక ఉన్న నిజం ఇదే!

వంటగదిలో పుదీనా వాసన లేకుండా వంట పూర్తి అవ్వడం అరుదు. చట్నీలు, షర్బత్‌లు, మజ్జిగ, సలాడ్లు ఇలా ఎన్నో వంటకాల్లో…

12 minutes ago

దాహం తీర్చుకుంటున్నాం అనుకుంటే.. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నామా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…

35 minutes ago

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

13 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

13 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

13 hours ago