Featured

Director Rajamouli : ఒక యాడ్ కోసం అన్ని కోట్లు తీసుకున్న జక్కన్న… హీరోలకు నువ్వేం తక్కువ కాదంటున్న ప్రేక్షకులు…!

Director Rajamouli : ఓటమెరుగని దర్శకుడిగా మన జక్కన పేరు ఆల్ ఇండియా లెవెల్లో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు సినిమాకు 1000 కోట్ల మార్కెట్ రుచి చూపించి ప్రపంచ పటంలో తెలుగు సినిమాను పెట్టిన ఘనత మన రాజమౌళికే దక్కుతుంది. సీరియల్ తీసే రేంజ్ నుండి సిల్వర్ స్క్రీన్ ను దున్నేసే రేంజ్ కి వెళ్లిన జక్కన్న బాలీవుడ్ సైతం తనతో సినిమా తీయాలని ఆరాటపడే రేంజ్ కి ఏదిగాడు. బాహుబలి తో తన స్టామినా ఏంటో ప్రపంచానికి చూపిన రాజమౌళి తాజాగా ఒక మొబైల్ యాడ్ లో కనిపించి కనువిందు చేసారు.

యాడ్ కోసం అంత పారితోషకం…

బాహుబలి తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేసేసాడు. అలాంటి దర్శకధీరుడితో ఒక్క సినిమా అవకాశం అంటూ చాలా మంది స్టార్ హీరోలు వెయిట్ చేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయబోతున్నారు రాజమౌళి, ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ఒక యాడ్ లో కనిపించాడు జక్కన. ఎపుడూ కమర్షియల్ యాడ్స్ లో కనిపించని జక్కన్న మొదటి సారి ఒక మొబైల్ యాడ్ చేసారు. తాజాగా టీవీలో వస్తున్న ఈ యాడ్ లో అందరినీ అక్కట్టుకుంటున్నాడు, జక్కనను నువ్వు హీరో మెటీరియల్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు.

ఒప్పో మొబైల్స్ కోసం మొదటి సారి యాడ్ లో నటించిన రాజమౌళి ఆ యాడ్ కోసం అదిరిపోయే రెమ్యూనరేషన్ కుడా అందుకున్నారట. ఒక సినిమా కోసం 150 కోట్లు తీసుకునే రాజమౌళి యాడ్ లో నటించడానికి మూడు కోట్లు తీసుకున్నారట. అంతే కాకుండా యాడ్ కోసం రాజస్థాన్ వెళ్లిన రాజమౌళి పనిలో పనిగా ఫ్యామిలీ ట్రిప్ ను కూడా రాజస్థాన్ లో కానిచ్చారు. స్వామి కార్యం స్వకార్యం రెండూ అన్నట్లుగా ట్రిప్ ఎంజాయ్ చేస్తూనే యాడ్ లో స్టైలిష్ గా కనిపించి అదరగొట్టాడు జక్కన్న.

Bhargavi

Recent Posts

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

2 hours ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

3 hours ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

3 hours ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

3 hours ago

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

3 hours ago

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

3 hours ago