ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. ఇది రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడిచేయనున్నారు.
తొలి భాగం డిసెంబరు 17న విడుదలకానుంది. ‘పుష్ప-2’ షూట్ పూర్తికాగానే కాస్త గ్యాప్ ఇచ్చి ‘ఆర్య-3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రంలో బన్నీ సరసన ఎవరు నటిస్తారనే వివరాలేవీ తెలియరాలేదు.
దర్శకుడు సుకుమార్, నటుడు అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి ఎంతో క్రేజ్ ఉంది. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప సినిమా కు సంబంధించి రెండో సాంగ్ కూడా ప్రోమో వచ్చింది. ఇది ప్రతీ ఒక్కరినీ అలరిస్తోంది.
అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తో సుకుమార్ ఆర్య, ఆర్య 2 సినిమాలను రూపొందించిన సుకుమార్ పుష్ఫ తర్వాత ఆర్య3 ని తెరకెక్కించనున్నారు. ఇటీవల లైవ్ చాట్‌లో సుకుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధమవుతోందని, త్వరలోనే అప్‌డేట్ చెబుతానని సుకుమార్ తెలిపారు. దీనిలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…