Featured

Director Teja : ఆడిషన్స్ లో సెలెక్ట్ గాని అమ్మాయినే హీరోయిన్ గా తీసుకున్న తేజ.. కానీ ఆయన తిక్కకి ఓ లెక్కుంది.!!

Director Teja : 1988 అక్కినేని నాగేశ్వరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో “రావుగారిల్లు” సినిమా షూటింగ్ జరుగుతుంది…దర్శకుడు తరనీ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ చేస్తున్నాడు. ఒకరోజు షూటింగ్ విరామంలో అదే సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్ గా చేరిన తేజతో.. షూటింగ్ కోసం డే లైట్ లుక్ కు సంబంధించి అడుగగా 10 రకాలుగా చెప్పడంతో రాంగోపాల్ వర్మ చాలా ఇంప్రెస్ అయ్యారు. తను తీయబోయే సినిమాకి తేజను కెమెరామెన్ గా పెట్టుకుంటానని తనతో హైదరాబాదు రమ్మని చెప్పారు. కెమెరామెన్ మహాదేవ్ తో జరిగిన విషయం చెప్పగా అసలు రాముకి దర్శకత్వం చేసే అవకాశం ఎవరిస్తారు? నువ్వు ఎలా కెమెరామెన్ అవుతావని తేజను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ తేజ ఆయన మాట వినకుండా రాముతో హైదరాబాద్ వచ్చాడు.

శివ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణిని, కెమెరామెన్ గా తేజని పెట్టుకుందామనుకున్నారు. కానీ నిర్మాతలు సురేంద్ర, వెంకట్ అందరూ కొత్తవారవుతున్నారు అనే ఉద్దేశంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజాను, కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డిని పెట్టుకున్నారు. అలా తేజకు కెమెరామెన్ గా అవకాశం రాకుండా పోయింది…ఆ తర్వాత రాంగోపాల్ వర్మ “రాత్రి” అనే సినిమాకు తేజను కెమెరామెన్ గా పెట్టుకున్నారు. సినిమా పెద్ద ఆడకపోయినా తేజకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాలకు కెమెరామెన్ గా చేస్తున్నప్పుడు కొన్ని సీనులకు తేజానే దర్శకుడిగా పని చేశారు. ఆ క్రమంలో ఒక కథ రాసుకున్నారు. అది రామోజీరావుకు నచ్చడంతో ఉదయ్ కిరణ్,రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా “చిత్రం” సినిమాని రూపొందించారు.

అది మంచి విజయం సాధించడంతో రెండవ చిత్రంగా “నువ్వు నేను” అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమాకి హీరో మాధవన్ ను అనుకున్నారు. కానీ అయన తెలుగులో నటించడానికి ఇష్టపడలేదు. చిత్రం సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఉదయ్ కిరణ్ తరచూ తేజ ఆఫీస్ కి వస్తూ ఉండేవాడు. వెంటనే నువ్వు నేను చిత్రానికి తిరిగి ఉదయ్ కిరణ్ నే హీరోగా తేజ ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ ఎవరని వెతుకుతున్న తరుణంలో ఆడిషన్స్ లో ఒక ఆరుగురు అమ్మాయిలను సెలెక్ట్ చేశారు. వీరిలో ముంబైకి చెందిన ఒక అమ్మాయిని హీరోయిన్ గా అనుకున్నారు.

కానీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో స్పెషల్ ఏ.సి రూమ్.. అడిషనల్ ఫెసిలిటీస్ కావాలని ఆమె డిమాండ్ చేశారు. తేజకు ఒక్కసారి కోపం వచ్చింది. ఆ అమ్మాయితో ఈ ఆడిషన్స్ కు వచ్చిన అమ్మాయిల్లో ఎవరు బాగోలేరని మీరు అనుకుంటున్నారని అడుగగా.. ఆమె ఒక అమ్మాయిని చూపించారు. ఆమె ఎవరో కాదు “నువ్వు నేను” చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనిత. చివరికి ఆ అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసి “నువ్వు నేను”సినిమా తీశారు. డైరెక్టర్ తేజ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఇదంతా గమనిస్తున్న వారు మొదట తేజకు తిక్కుందనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన పనికి ఓ లెక్కుందని సముదాయించుకున్నారు. ఏదైతేనేం మొత్తానికి వర్మ శిష్యుడు అనిపించుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago