Disco Shanthi : తెలుగు సినిమాలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలను సులువుగా చేసేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి గారు చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించి ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకులనూ షాక్ కి గురిచేసారు. ఇక ఆయన భార్య అలనాటి తార డిస్కో శాంతి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇక తన భర్త శ్రీహరి గారు చనిపోయాక చాలా ఏళ్ల తరువాత ఇంటర్వ్యూతో మరో సారి కనిపించారు. శ్రీహరి గారు చనిపోయాక పరిస్థితులు ఎలా మారిపోయాయో చెప్పారు.
బావ చనిపోయాక మాట్లాడించిన వాళ్ళు ఎవరూ లేరు…
శ్రీహరి గారు (బావ) హటాత్తుగా మరణించాక దిక్కుతోచలేదు. ఆయన బ్రతికున్నపుడు నటించిన సినిమాల తాలూకు రెమ్యూనరేషన్ లు చాలా మంది బావ మరణించాక ఎగొట్టారు. సినిమా అంటే బావకి పిచ్చి డబ్బులు ఇస్తారా లేదా అని చూడకుండా సినిమా చేసేవారు. ఇక ఆయనకు ఇష్టమైనదాన్ని కాదనకూడదని నేను సినిమాలకు ఓకే చెప్పేదాన్ని. ఇక ఆయన మరణం తరువాత నటించిన సినిమాల తాలూకు డబ్బులు రాకపోవడం వల్ల చేసిన అప్పులు అన్నీ తీర్చడానికి నగలు, ఉన్న ఆస్తులు అమ్మాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఎవరూ ఫోన్ చేసి కూడా మాటాడిచ్చిన వాళ్ళు లేరు. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఫోన్ చేసి సినిమా తాలూకు డబ్బులు అందాయా ఇంకా ఏమైనా బ్యాలన్స్ ఉందా, ఏదైనా సహాయం కావాలంటే అడగండని చెప్పారు. ఆయనే స్వయంగా ఫోనే చేయాల్సిన అవరం లేదు కదా అయినా చేయడం ధైర్యం ఇచ్చింది. ఆయన మరణించిన తరువాత చిరంజీవి వంటి వారు మాత్రమే డబ్బులు సకాలనికి చెల్లించారు. ఇక చాలా మంది డబ్బులు ఎగొట్టారు అంటూ ఎమోషనల్ అయ్యారు శాంతి.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…