Janardhan Rao : జెన్నీ అనగానే టక్కున గుర్తురాకపోవచ్చు కానీ ఆయన నటించిన సినిమాల్లో పాత్రలు మాత్రం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. చాలా సినిమాల్లో, సీరియల్స్ లో, ముఖ్యంగా కామెడీ పాత్రల్లో ఎక్కువగా నటించారు. జెన్నీ గారి అసలు పేరు “పోలాప్రగడ జనార్ధన రావు” ఈయనది రాజమండ్రి, ECILలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సులో కూడా పని చేసారు, ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో, మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జంద్యాల గారితో పని చేసిన అనుభవాన్ని పంచుకున్నారు.
కోట, బ్రహ్మానందం, నేను జంధ్యాల గారు నైట్ సిట్టింగ్ వేసేవాళ్ళం…
జంద్యాల గారు ఎన్నో వినోదాత్మకమైన చిత్రాలు తీశారు. అందులో జేన్నీ గారు కుడా కొన్ని చిత్రాలలో నటించడం జరిగింది. చూపులుకలిసిన శుభవేళ, అహ! నా పెళ్లంటా, యమలీల వంటి చిత్రాల్లో నటించారు. అలా నటిస్తున్న సమయంలో జంధ్యాల గారు ఒక మంచి సలహా ఇచ్చారట, ఒక సనివేశంలో కెమెరా ముందు ఉన్నపుడు మీ అభినయం సన్నివేశ పరంగా ఉండాలి, నాటకాల్లో స్టేజి మీద చేసినట్టు ఎక్కువ అభినయం ప్రదర్శిస్తే ఓవర్ గా చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ కెమెరా ముందు ఎలా ఉండాలి కనెక్టివిటీ ఎలా ఉండాలి అంటూ సలహాలు ఇచ్చేవారట.
ఒక చిన్న సన్నివేశమైనా పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఒక పెద్ద పాత్రలో కూడా బాగా చేయగలరు అంటూ జంధ్యాల చెప్పేవారట. ఇక సీన్ సరిగ్గా చెయ్యలేక బాధపడినపుడు ఇలా డల్ అవ్వకూడదు మానసికంగా సంతోషంగా ఉండాలి, ఇది కాకపోతే మరోటి అని సరదాగా మాట్లాడేవారు అని జంధ్యాల గురించి జెన్నీ చెప్పుకొచ్చారు. సాయంత్రం అవ్వగానే జంధ్యాల గారితో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నేను ఇంకా కొంతమంది అలా సిట్టింగ్ వేసేవాళ్ళం. నాకు తాగడం అలవాటు లేకపోయినా కాలక్షేపానికి కూర్చునేవాళ్ళం అంటూ జంధ్యాల గారితో ఉన్న అందమైన స్నేహ సంబంధాన్ని, ఆత్మీయతను వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…