Movie News

“తల్లిని అయితే నా వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా? నా బట్టలు నా ఇష్టం..” : అనసూయ భరద్వాజ్

హైదరాబాద్: యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనపై వచ్చే ట్రోల్స్, నెగటివ్ కామెంట్లకు ఘాటుగా స్పందించడం కూడా ఆమె ప్రత్యేకత. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్, ముఖ్యంగా మహిళలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై ఒక ఎమోషనల్ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘మహిళల నుంచే వ్యక్తిగత దాడులు తట్టుకోలేకపోతున్నా’

అనసూయ తన లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, “ఇటీవలి కాలంలో కొందరు మహిళలు యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నాపై వ్యక్తిగతంగా రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఇప్పటివరకు అలాంటి కామెంట్లు, వీడియోలపై ఎక్కువగా సైలెంట్‌గా ఉన్నా, మహిళల నుంచే ఇలాంటి వ్యక్తిగత దాడులు రావడం తట్టుకోలేకపోతున్నా. నేను ఒక తల్లిగా, భార్యగా, మహిళగా నా బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నాను. అదే సమయంలో నాకు నచ్చినట్టుగా డ్రెస్సులు వేసుకుంటాను. దాంతో మీకు ఇబ్బంది ఏమిటి?” అని ప్రశ్నించారు.

‘నా డ్రెస్సింగ్ నా స్టైల్, గ్లామర్, కాన్ఫిడెన్స్‌లో భాగం’

ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్‌ను సమర్థించుకుంటూ, “నేను ఒక యాక్టర్‌ని. నా డ్రెస్సింగ్ నా స్టైల్, గ్లామర్, కాన్ఫిడెన్స్‌లో భాగం. నేను తల్లి అయ్యానని నా వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా? నా ఫ్యామిలీ, నా పిల్లలు నేను ఎలా ఉన్నా అలాగే ప్రేమిస్తారు. వాళ్లు నన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. నేను పాష్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తే కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నా డ్రెస్‌ల ఆధారంగా నేను విలువలు కోల్పోయానని అనుకోవడం తప్పుడు అభిప్రాయం” అని స్పష్టం చేశారు.

‘నాపై కూడా గౌరవం చూపాలి’

అనసూయ తన లేఖను ముగిస్తూ, “నేను ఎవరికీ నా లైఫ్‌స్టైల్‌ను ఫోర్స్ చేయడం లేదు. మీకు నచ్చినట్టు మీరు లైఫ్ గడపండి, నేను తీర్పు ఇవ్వను. అదే విధంగా నాపై కూడా గౌరవం చూపాలి. మన మధ్య ఉన్న తేడాలను దాడులుగా మార్చకుండా అంగీకరించగలిగితే మనందరం హ్యాపీగా జీవించగలం” అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఈ లేఖతోనైనా ఆమెపై వస్తున్న ట్రోలింగ్ తగ్గుతుందో లేదో చూడాలి.

telugudesk

Recent Posts

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

4 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

5 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

5 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

5 hours ago

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…

1 day ago

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…

2 days ago