Shiva Jyothi: శివజ్యోతి అనే పేరు కంటే.. తీన్మార్ సావిత్రిగా ఆమె పేరు చాలామందికి తెలుసు. బిత్తిరి సత్తితో వీ6 ఛానల్ లో వాళ్లిద్దరు కలిసి చేసిన ఈ ప్రోగ్రాం మూడు పువ్వుల.. ఆరు కాయలుగా వర్ధిల్లింది. తీన్మార్ వార్తలు వస్తున్నాయంటే.. పల్లెటూర్లో ఉండే వారితో పాటు.. పట్టణ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయేవారు.
వారిద్దరి మధ్య సంభాషణ అలా ఉండేది మరి. అయితే వార్తలు చెబుతున్న క్రమంలో సావిత్రి అచ్చదనాలా తెలుగు అమ్మాయిలా.. నుదిటిపై బొట్టు.. చేతికి గాజులు, చీరకట్టు చూడ ముచ్చటగా అనిపించేది. ఎక్కడ కూడా ఆమె ప్రవర్తించే తీరు విమర్శలకు గురి కాలేదు. అయితే ఈ షోలో వచ్చిన ఫేమ్ కారణంగానే ఆమె బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
సీజన్ 3లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సావిత్రి అలియాస్ శివజ్యోతి దాదాపు చివరి వరకు ఉంది. లాస్ట్ మరో రెండు వారాలు ఉన్నాయనగా.. బయటకు వచ్చింది. ఇక బయటకు వచ్చిన తర్వాత శివజ్యోతి వ్యవహారం తేడాగా కనిపించింది. ఆమె ధరించే దుస్తుల్లో చాలా మార్పు కనిపించింది. ఆమె కట్టు , బొట్టులో చాలా తేడా వచ్చింది.
వీ6ను వదిలేసిన సావిత్రి ప్రస్తుతం టీవీ9లో న్యూస్ రీడర్ గా చేస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. అంతే కాదు.. కామెంట్లలో విపరీతంగా ఏకిపారేశారు కూడా. శివజ్యోతి ఎప్పుడూ చీరటకట్టులో తెలుగందం..ఉట్టిపడేలా కనిపించేది.. కానీ రాను రాను ఆమె డ్రస్సింగ్ సెన్స్ ల్ భారీ మార్పులు వచ్చాయని కామెంట్ల రూపంలో వాళ్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఆమె బ్లాక్ డ్రస్ లో ఉన్న ఫొటో చూసి.. అక్కడ మీరు ఇలా ఉంటే చూడలేము.. ఇటువంటి డ్రస్ లు వేసి మీ వాల్యూని తగ్గించకోకండి. మీరంటే ఓ రెస్పెక్ట్ ఉంది. ఇలా చేస్తే.. మీరు కూడా ఆ టైపేలే అనిపిస్తుంది అక్క.. అంటూ ఆమె వస్త్రాధారణపై కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…