Siddharth: హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్విట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల ప్రధాని భద్రతా వైఫల్యంపై ప్రముఖ బ్యాట్మిటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ ఓ ట్వీట్ చేశారు. సైనా ఏమని ట్వీట్ చేశారంటే.. ప్రధాని కాన్వాయ్ ని పంజాబ్ లో అడ్డగించడంపై ఆమె ఖండించింది. ప్రధానిపై దాడికి యత్నించడం
పిరికిపంద చర్య అని.. ప్రధానిపైనే ఇలా జరిగితే ఆ దేశంలో భద్రంగా ఉన్నట్లు కాదని.. ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ రీ ట్వీట్ ఇలా అన్నాడు. చిన్న కాక్ తో ఆడే ఓ ఛాంపియన్.. దేవుడి దయ కారణంగా.. మన దేశాన్ని కాపాడే వాళ్లు ఉన్నారు అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాదు.. షేమ్ ఆన్ యూ అంటూ..యాష్ ట్యాగ్ రిహానా అంటూ ముగించాడు.
ఇది చాలా వ్యంగ్యంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక దీనిపై రిహానా, సైనా నెహ్వాల్, చిన్మయి శ్రీపాద కూడా రీ ట్వీట్ చేశారు. సిద్దార్థ్ చేసిన ట్వీట్ కు చిన్మయి తప్పు పడుతూ ట్వీట్ చేశారు.
దేనికైతే తాము పోరాటం చేస్తున్నామో.. ఇంకా తాము మళ్లీ పోరాటం చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఇది అత్యంత దారుణం అంటూ చెప్పారు. ఇక మహిళల పట్ల ఇంత దారుణమైన భాషను మాట్లాడం ఏంటని నెటిజన్లు కూడా మండిపడుతన్నారు. హీరోయిన్లను రక్షించే సిద్ధార్థ్.. బయట మాత్రం మహిళలను హింసించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఇండియా గ్రీవెన్స్‌ను డిమాండ్ చేశారు. ఇక దీనిపై హీరో సిద్ధార్థ్ ప్రతిస్పదించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన వ్యాఖ్యలను మరో విధంగా అన్వయించడం అనైతికమని మరో ట్వీట్ చేశాడు. తన ఉద్దేశ్యం ఎవరినీ అవమాన పర్చాలని కాదన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…