Shiva Jyothi: శివజ్యోతి అనే పేరు కంటే.. తీన్మార్ సావిత్రిగా ఆమె పేరు చాలామందికి తెలుసు. బిత్తిరి సత్తితో వీ6 ఛానల్ లో వాళ్లిద్దరు కలిసి చేసిన ఈ ప్రోగ్రాం మూడు పువ్వుల.. ఆరు కాయలుగా వర్ధిల్లింది. తీన్మార్ వార్తలు వస్తున్నాయంటే.. పల్లెటూర్లో ఉండే వారితో పాటు.. పట్టణ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయేవారు.
వారిద్దరి మధ్య సంభాషణ అలా ఉండేది మరి. అయితే వార్తలు చెబుతున్న క్రమంలో సావిత్రి అచ్చదనాలా తెలుగు అమ్మాయిలా.. నుదిటిపై బొట్టు.. చేతికి గాజులు, చీరకట్టు చూడ ముచ్చటగా అనిపించేది. ఎక్కడ కూడా ఆమె ప్రవర్తించే తీరు విమర్శలకు గురి కాలేదు. అయితే ఈ షోలో వచ్చిన ఫేమ్ కారణంగానే ఆమె బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
సీజన్ 3లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సావిత్రి అలియాస్ శివజ్యోతి దాదాపు చివరి వరకు ఉంది. లాస్ట్ మరో రెండు వారాలు ఉన్నాయనగా.. బయటకు వచ్చింది. ఇక బయటకు వచ్చిన తర్వాత శివజ్యోతి వ్యవహారం తేడాగా కనిపించింది. ఆమె ధరించే దుస్తుల్లో చాలా మార్పు కనిపించింది. ఆమె కట్టు , బొట్టులో చాలా తేడా వచ్చింది.
వీ6ను వదిలేసిన సావిత్రి ప్రస్తుతం టీవీ9లో న్యూస్ రీడర్ గా చేస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. అంతే కాదు.. కామెంట్లలో విపరీతంగా ఏకిపారేశారు కూడా. శివజ్యోతి ఎప్పుడూ చీరటకట్టులో తెలుగందం..ఉట్టిపడేలా కనిపించేది.. కానీ రాను రాను ఆమె డ్రస్సింగ్ సెన్స్ ల్ భారీ మార్పులు వచ్చాయని కామెంట్ల రూపంలో వాళ్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఆమె బ్లాక్ డ్రస్ లో ఉన్న ఫొటో చూసి.. అక్కడ మీరు ఇలా ఉంటే చూడలేము.. ఇటువంటి డ్రస్ లు వేసి మీ వాల్యూని తగ్గించకోకండి. మీరంటే ఓ రెస్పెక్ట్ ఉంది. ఇలా చేస్తే.. మీరు కూడా ఆ టైపేలే అనిపిస్తుంది అక్క.. అంటూ ఆమె వస్త్రాధారణపై కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…
ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…