మన ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం తీసుకోవటం ఎంత అవసరమో నిద్రపోవడం కూడా చాలా అవసరం. రోజుకు 8 గంటలు తప్పకుండా నిద్ర పోవాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రపోయే ముందు కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
రాత్రివేళ నిద్రపోయే ముందు చాలామందికి గోరువెచ్చని పాలు తాగటం అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. కానీ కొద్దిమంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.నిద్రపోయే ముందు చాలామందికి జ్యూస్ తాగే అలవాటు ఉంటుంది. కానీ అలా చేయటం చాలా పొరపాటు. ముఖ్యంగా కమలా పండు జ్యూస్ అసలు తాగకూడదు.జ్యూస్ త్రాగటం కంటే పళ్ళను తినటమే చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొద్దిమందికి రాత్రివేళ నిద్రపోయేటప్పుడు కాఫీ తాగితే కానీ నిద్ర పట్టదు. అలా చేయడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.నిద్రపోయే ముందు ఫాస్ట్ ఫుడ్స్ లైక్ పిజ్జా, బర్గర్ వంటి వాటిని తినకూడదు. అవి తినడం వల్ల సరిగా అరగక ఇబ్బంది పడవలసి వస్తుంది.
రాత్రి వేళ ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం తొందరగా అరుగుతుందని లెమన్ జ్యూస్ కానీ లేదా ఇతర ఏదైనా సోడా తాగుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల కూడా చాలా ప్రమాదం.నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం చేసి నిద్ర పోవాలని అప్పుడే ప్రశాంతమైన నిద్ర కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…