Nayanathara wedding: నయనతార పెళ్లి కోసం భారీగా డబ్బు చెల్లించిన నెట్ ఫ్లిక్స్… ఎన్ని కోట్లో తెలుసా?

Nayanathara wedding: నయనతార పెళ్లి కోసం భారీగా డబ్బు చెల్లించిన నెట్ ఫ్లిక్స్… ఎన్ని కోట్లో తెలుసా?

Nayanathara wedding: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుక. ఇలాంటి ముఖ్యమైన వేడుకను జీవితాంతం గుర్తుంచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని పెళ్లిని కూడా కమర్షియల్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీలు వారి పెళ్లిళ్లను ప్రముఖ ఓటీటీలకు అమ్మడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

Nayanathara wedding: నయనతార పెళ్లి కోసం భారీగా డబ్బు చెల్లించిన నెట్ ఫ్లిక్స్… ఎన్ని కోట్లో తెలుసా?
Nayanathara wedding: నయనతార పెళ్లి కోసం భారీగా డబ్బు చెల్లించిన నెట్ ఫ్లిక్స్… ఎన్ని కోట్లో తెలుసా?

ఈ క్రమంలోనే గత యేడాది వివాహం చేసుకున్నా బాలీవుడ్ సెలబ్రెటీలు విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ దంపతులు సైతం వీరి వివాహాన్ని అమెజాన్ ప్రైమ్ కోసం ఏకంగా 80 కోట్లకు అమ్మారు. తాజాగా వీరి బాటలోనే నయనతార విగ్నేష్ దంపతులు సైతం వీరి వివాహ వేడుకను నెట్ ఫ్లిక్స్ కి భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది.అందుకే వీరి వివాహానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు కానీ బయటకు రాకుండా ఈ జంట జాగ్రత్తపడ్డారు.

Nayanathara wedding: నయనతార పెళ్లి కోసం భారీగా డబ్బు చెల్లించిన నెట్ ఫ్లిక్స్… ఎన్ని కోట్లో తెలుసా?

వివాహం అనంతరం స్వయంగా విగ్నేష్ వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే వీరి వివాహాన్ని మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అదే విధంగా అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంతో అందమైన లొకేషన్లలో ఘనంగా వీరి వివాహం జరిగింది.

పెళ్లిని కూడా కమర్షియల్ చేస్తున్నారు…

ఇక వీరి వివాహాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వ పర్యవేక్షణలో చిత్రీకరించారని సమాచారం. గౌతమ్ మీనన్ వీరి వివాహాన్ని ఒక డాక్యుమెంటరీగా రూపొందించి నెట్ ఫ్లిక్స్ కి ఏకంగా 30 కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. ఈ క్రమంలోనే త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో వీరి వివాహ వేడుక ప్రసారం కానుందని తెలుస్తోంది. ఇలా ఎంతో ఘనంగా పెళ్లి జరుపుకున్న అప్పటికీ ఆ పెళ్లి వేడుకను కూడా భారీ మొత్తానికి అమ్మడంతో పలువురు ఈ వ్యవహారశైలిపై విమర్శలు కురిపిస్తున్నారు.