Naveen Polishetty: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నవీన్ పోలిశెట్టి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?
Naveen Polishetty: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం రాదే శ్యామ్.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోని పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో ఘనంగా జరుపుకుంది.
ఈ ఈవెంట్ కి ఎంతోమంది మేల్ యాంకర్స్ ఉండగా వారెవరినీ కాకుండా మన జాతి రత్నం నవీన్ పోలిశెట్టిని యాంకర్ గా తీసుకున్నారు.నవీన్ పోలిశెట్టి యాంకర్ గా మారడం ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది. మన తెలుగులో ఎంతోమంది యాంకర్స్ ఉన్నప్పటికీ వారికి పాన్ ఇండియా స్థాయిలో యాంకరింగ్ చేసే అనుభవం లేకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టింగ్ చేయడం వల్ల సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో అతనిని తీసుకున్నట్లు సమాచారం.
నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ముందుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి సైతం తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టింగ్ చేశారు.
అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హోస్టింగ్ చేసినటువంటి నవీన్ పోలిశెట్టి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకు యాంకర్ గా చేసినందుకు ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. కేవలం ప్రభాస్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాకు ఫ్రీ గా అతను యాంకరింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి నవీన్ పోలిశెట్టి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…