Movie News

సౌందర్య ఇల్లు ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉందో తెలుసా..?

తెలుగు సినీ ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాలపాటు ఏలిన అందాల నటి సౌందర్య హఠాత్మరణం ఇప్పటికి అందరిని కంట తడి పెట్టిస్తుంది. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె సౌందర్య మాత్రమె.. తెలుగు సినిమాలల్లో నటించడం మొదలు పెట్టి అనాది కాలంలోనే ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే ఆమెకు తోలిసారిగా వచ్చిన సినిమా అవకాశం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణతో “రైతు భారతం” అనే చిత్రం కోసం దర్శకుడు చిట్టిబాబు ప్లాన్ చేస్తున్న సమయంలో మొదట ఆ చిత్రానికి కధానాయికగా వాణి విశ్వనాథన్ ని అనుకున్నారు.

ఆ తరువాత అదే చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మంచి నటి కావాలని వెతుకుతుండగా, రామయ్య అనే ఎడిటర్ డైరెక్టర్ చిట్టిబాబుకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న నటి బెంగళూరులో ఉందని చెప్పడం జరిగింది. అయితే డైరెక్టర్ చిట్టిబాబు మాత్రం ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నేరుగా సౌందర్య ఇంటికి వెళ్లారు. అలా ఎటువంటి మేకప్ లేకుండా ఉన్న ఆమెను చూసి, ఆలస్యం చేయకుండా వెంటనే తన సినిమాలోని రెండో కధానాయిక పాత్రకు ఎంపిక చేసేసారు. అలా సౌందర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఏ రేంజ్ కి ఎదిగిందో అందరికి తెలిసిందే. అప్పట్లో టాప్ హీరోలు అందరూ ఆమెతో నటించాలని భావించేవారట. సౌందర్య డేట్స్ ఖాళీ లేకపోయినా సరే వెయిట్ చేసి మరీ డేట్స్ ఆమెతో సినిమాలు చేసేవారు.

అందంతో పాటు అభినయం కలగలిసిన సౌందర్య తానూ నటించిన పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టేది. ఇకపోతే సేనియర్ నటి ఆమనీ తన స్నేహితురాలు సౌందర్య గురించి ఆమె ఇల్లు గురించి ఈ మధ్య ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెంగళూరులో సౌందర్యకి ఒక సొంత ఇల్లు ఉండేది. ఇక ఇప్పుడైతే మరీ బూత్ బంగ్లా గా మారిపోయిందని, దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవలే అటువైపుగా వెళ్ళినపుడు చూశాను” అంటూ సౌందర్య ఆ ఇంట్లో ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఆమని.

TD Admin

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago