Featured

ప్రముఖ నటి ‘యమున’ మెగాస్టార్ తో నటించే అవకాశాన్ని చేజేతులారా వదులుకున్న సినిమా ఏంటో తెలుసా.?!

సినీరంగ ప్రవేశం ఒక్కరిది ఒక్కోరకంగా ఉంటుంది.కష్టపడి ఒకరు వస్తే కడుపులో చల్ల కదలకుండా వచ్చిన వారు మరొకరు. 1990 దశకంలో తెలుగు తెరకు వచ్చిన అతికొద్ది మంది హీరోయిన్లలో ‘యమున’ ఒకరు. అసలు పేరు ‘ప్రేమ’ అయినప్పటికీ బాలచందర్ యమునగా మార్చారు. సినిమాల్లోకి వెలుదామన్న ఆలోచన కళలో కూడా చేయని ‘యమున’ తన అక్కతో పాటుగా షూటింగ్ వెళ్లినప్పుడు ప్రఖ్యాత దర్శకుడు ‘బాలచందర్’ చూడడం వెంటనే ఆమెను హీరోయిన్ గా బుక్ చేసుకోవడం జరిగింది.

ఆ వెంటనే తెలుగులో అట్లూరి రామారావు ఆడిషన్ చేసి ఉషాకిరణ్ మూవీస్ తీయబోయే చిత్రానికి యమునను ఎంపికచేయడం జరిగింది. అలా 1989 ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణం, ఏ.మోహన్ గాంధీ దర్శకత్వంలో “మౌనపోరాటం” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో వినోద్ కుమార్, యమున హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత అగ్నిప్రవేశం, ఆడది, ఉద్యమం, ఘటన, పుట్టింటి పట్టు చీర, మామగారు వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. కన్నడంలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్ లాంటి హీరోలతో ఆమె నటించారు. తెలుగులో నటించిన మౌనపోరాటం, మామగారు చిత్రాలకు ఆమెకు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో యమునకు “మెగాస్టార్ చిరంజీవి” తో నటించే అవకాశం వచ్చింది.

1990 రమా ఫిలిమ్స్, కె.నాగేశ్వర్ రావు నిర్మాణం. మురళిమోహన్ రావు దర్శకత్వంలో “కొదమ సింహం” చిత్రం విడుదలయ్యింది. ఇందులో చిరంజీవి, వాణివిశ్వనాథ్, రాధ, సోనం హీరో, హీరోయిన్లుగా నటించారు. పూర్తి నిడివితో కూడిన కౌబాయ్ పాత్రలో ‘మెగాస్టార్’ ఈ చిత్రంలో నటించారు. నిర్మాత కైకాల నాగేశ్వరరావు కోరికమేరకు కౌబాయ్ చిత్రంలో నటించడానికి ఆ రోజుల్లో చిరంజీవి గారు ఒప్పుకున్నారు. ‘మౌనపోరాటం’ చిత్రంలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న యమునను కొదమ సింహంలో సోనమ్ చేసిన పాత్రకు ముందుగా సంప్రదించారు. కానీ అప్పటికే యమున అగ్నిప్రవేశం, ఆడది, ఉద్యమం, ఘటనలాంటి చిత్రాలతో బిజీగా ఉండడంతో.. చిరంజీవి డేట్స్ కి యమున డేట్స్ కుదరక‌ పోవడంతో ఆ స్థానంలో బాలీవుడ్ నటి “సోనమ్”ను తీసుకోవడం జరిగింది.

లోగడ ఇదే పాత్రకి తెలుగులో మరొక హీరోయిన్ “నదియా”ను కూడా సంప్రదించడం గమనార్హం. ఒకవేళ చిరంజీవితో‌ కలిసి నటిస్తే ఆ తర్వాత అనేక సినిమాల్లో స్టార్ హీరోలతో నటించే అవకాశం పొందీ ఉండేదాన్నని.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం లాంటివి తనకు తెలిసేది కాదని అలా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కోల్పోయానని ఒక ఇంటర్వ్యూలో “యమున” చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago