Featured

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

రేణు దేశాయ్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఈమె పవన్ కళ్యాణ్ కు మాజీ భార్య. రేణుదేశాయ్ సినిమాల్లోకి రాకముందు ఓ మోడల్ గా పని చేసారు. ఆవిడ మోడల్ రంగం నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ చిగురించింది.

తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో కుమారుడు అకిరా.. కూతురు ఆద్య. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయే వరకు కూడా పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ అన్ని ఆవిడే చూసుకునేది. ఇక పిల్లలకు సంబంధించి ఏ విషయం అయినా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది.

ఇటీవల అకీరాకు సంబంధించి కర్రసాము వీడియో పోస్టు చేయగా అది పెద్ద వైరల్ అయింది. మళ్లీ తాజాగా ఆద్యకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. ఆద్య గిటార్ వాయిస్తూ ఉన్న వీడియోను చూసిన మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఇక రేణుదేశాయ్ ప్రస్తుతం పూణెలో స్థిరపడగా.. గత కొన్ని రోజుల నుంచి ఆమెకు హైదరాబాద్ లో ఉంటుంన్నారట.ఆమెకు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. అక్కడే ఆమె నివాసం ఉంటున్నారు.

ఇక ఆమె ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తో విడిపోయిన తర్వాత ఆమెకు భరణం కింద భారీగా డబ్బులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. దానికి ఆమె సమాధానం చెబుతూ.. తనకు ఏం ఇవ్వలేదని.. అది ఫేక్ అంటూ కొట్టి పారేశారు. అయితే ఆమెకు జూబ్లీ హిల్స్‌లో ఖరీదైన ఇల్లు.. మూడు కార్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పూణేలో కూడా స్థిరాస్థులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇవన్నీ నిరాధారమైనవి. మొత్తానికి ఆమె వద్ద రూ.40 కోట్ల వరకు ఆస్తి ఉంటుందనేది టాక్ వినిపిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఇండియాతో ట్రేడ్ డీల్‌పై ట్రంప్ సంచలన ప్రకటన.. సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త మలుపు!

అమెరికా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు Donald Trump ప్రారంభించిన టారిఫ్ యుద్ధానికి అమెరికా అత్యున్నత న్యాయస్థానం…

4 minutes ago

చీకట్లో ఫోన్ వాడుతున్నారా? 90% యువతలో మయోపియా ప్రమాదం!

రాత్రివేళ గది లైట్లు ఆఫ్ చేసి మొబైల్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. మంచంలో పడుకుని మసక వెలుతురులో ఫోన్…

15 minutes ago

2 ఓవర్లు 29 పరుగులు.. అయినా టీమిండియాకు అతడే ముప్పు! సూపర్-8లో సౌతాఫ్రికా ప్లాన్ ఏంటి?

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాటర్ మెరిసినా, మొత్తం…

23 minutes ago

గవర్నమెంట్ టీచర్లకు అమెరికా చాన్స్.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ప్రారంభం!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం దక్కింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి…

33 minutes ago

హెల్తీ స్నాక్ అనుకుంటున్నారా? ఖర్జూరాలు అతిగా తింటే ఇవే సమస్యలు!

ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారాల్లో ఖర్జూరాలు ముందుంటాయి. ఉపవాసాల సమయంలోనైనా, అలసటగా అనిపించినప్పుడైనా చాలామంది వెంటనే ఖర్జూరాలనే తీసుకుంటారు. తక్షణ శక్తిని…

43 minutes ago

అనారోగ్యమా? ముందే AIని అడుగుతున్నారా? నిపుణుల హెచ్చరిక ఇదే!

డిజిటల్ యుగంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా గూగుల్‌లోనే వెతుకుతున్నారు. జ్వరమా, దగ్గు లేదా…

43 minutes ago