General News

40 ఏళ్ళ క్రితమే కోవిడ్.. కాకపోతే?

గత ఏడాది నుంచి యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ కు మరో పేరు కోవిడ్-19 . అయితే కొవిడ్-19 గత సంవత్సరమే కాకుండా సుమారు నలభై సంవత్సరాల క్రితమే ఉంది. అయితే అది వైరస్ రూపంలో కాదు. కోవిడ్ అనేది ఒక కంపెనీ పేరు. అమెరికాలోని ఆరిజోనాలో ఉంది. ఈ కంపెనీ పూర్తి పేరు covid lnc. ఈ కంపెనీ పేరు కోవిడ్ అని ఉండటం వల్ల ఇక్కడ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి మందులు కానీ, చికిత్స కానీ, పరీక్షలు కానీ నిర్వహిస్తారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కోవిడ్ వ్యాధికి, ఈ కోవిడ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. అమెరికాలో స్థాపించినటువంటి ఈ కంపెనీలో హైక్వాలిటీ ఆడియో విజువల్ వాల్ ప్లేట్స్, కేబుళ్లను విక్రయిస్తారు. అయితే, ఇప్పటివరకు వారు తమ ఉత్పత్తులను డీలర్ల ద్వారా మాత్రమే విక్రయించడం వల్ల ఈ కంపెనీ పేరు సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు.

కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి చాలామంది దృష్టి ఈ కంపెనీ పై పడింది. ఎంతో మంది ఇక్కడికి వచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తారా? కరోనాకు చికిత్స చేస్తారా? అని అడగటంతో ఈ కంపెనీ సీఈవో నార్మ్ కర్సాన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌కు ‘కోవిడ్-19’ అని పేరు పెట్టగానే మాకు కస్టమర్లు పెరుగుతారని భావించాం. నిజంగానే మా కంపెనీకు పెద్ద ఎత్తున కస్టమర్లు పెరిగారు. కానీ కోవిడ్ సెంటర్‌గా భావించేవారు. మా కంపెనీ పేరు చూసి గందరగోళానికి గురయ్యేవారు.

ప్రస్తుతం తీవ్రంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది జనాలు చనిపోతుంటే మీ కంపెనీకు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు అని ఎంతోమంది తిడుతున్నట్లు కూడా కంపెనీ సీఈవో తెలియజేశారు. అయితే మా కంపెనీ కు కోవిడ్ అనే పేరును ఇప్పుడు పెట్టుకున్నది కాదని… ఈ పేరును గత నలభై సంవత్సరాల క్రితమే తమ కంపెనీకి పెట్టినట్లు తెలిపారు.

నలభై సంవత్సరాల క్రితమే కంపెనీ స్థాపించినప్పుడు దీనికి పేరు Video Company’ లేదా ‘VidCo’ అనే పెరు పెడదామని భావించారు అయితే అప్పటికే ఈ పేరు పై ఎన్నో కంపెనీలు ఉండడంతో తమ కంపెనీకి CoVid అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా covid19 వ్యాప్తి చెందే వరకు తమ కంపెనీ ఒకటి ఉందని ఎవరికి తెలియదు. అయితేఎలాంటి పరిస్థితులు తలెత్తిన తమ కంపెనీ పేరు మార్చుకోమని ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago