Featured

అనసూయ భర్త ఏం చేస్తారో తెలుసా.. అతని గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలివే!

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అటు బుల్లితెర ఇటు వెండితెరలో సమాన క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. రంగస్థలంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఎంతో ఫేమ్ తెచ్చుకున్నారు.

ముప్పై సంవత్సరాల వయస్సులో, ఆమె గొప్ప ఆఫర్‌లను పొందడం ద్వారా హీరోయిన్లతో పోటీపడుతుంది. ఇప్పటికే తమిళం మరియు మలయాళంలో సినిమాలు చేస్తున్న ఈమెకు హీరోయిన్స్ లాగే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు. అయితే అనసూయది ప్రేమ వివాహం అని ఆమె చాలా సార్లు చెప్పింది. అయితే అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.

ఆమె కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది అనసూయ. ఇక వారికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త ఫైనాన్షియర్ మరియు ఫండింగ్ ప్లానర్ అని ఒక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది.

గతంలో అనసూయ తన భర్తను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కూడా చేసింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో తాను మొదట్లో బాధపడ్డానని, అయితే తన ఇంటి సహాయంతో, ముఖ్యంగా తన భర్త సహాయంతో వాటిని అధిగమించానని ఆమె పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. అనసూయ పుష్పలో కూడా ఒక పాత్రను పోషిస్తుంది. ఆమె నటుడు సునీల్‌కు భార్యగా కనిపించనుంది. ఇవి మాత్రమే కాదు యాంకర్ అనసూయ మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

13 minutes ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

34 minutes ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

51 minutes ago

ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఈ నెంబర్ వెంటనే సేవ్ చేసుకోండి!

ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…

1 hour ago

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

2 hours ago

మెగాస్టార్ చిరంజీవికి చిన్న సర్జరీ.. ‘నేను బాగానే ఉన్నాను’ అంటూ క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…

2 hours ago