Categories: General News

సోషల్ మీడియా పిచ్చి ఉంటే చాలు.. ఈ జాబ్ మీదే!

ముంబైకి చెందిన ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ మాంక్ ఎంటర్ టైన్ మెంట్ ఒక విచిత్రమైన ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ విరాజ్ శేఠ్ తమ సంస్థలో “డూమ్-స్క్రోలర్” అనే కొత్త ఉద్యోగిని నియమించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ పదం వినగానే అర్థమయ్యేది ఏంటంటే – గంటల తరబడి తమ మొబైల్ ఫోన్ లో ఎండ్ లెస్ గా స్క్రోల్ చేస్తూ ఉండేవారే ఈ ఉద్యోగానికి సరిపోతారు.

నిజానికి, “డూమ్ -స్క్రోలర్” అనే పదం మొదట సోషల్ మీడియాలో ఆందోళన కలిగించే వార్తలు, గాసిప్ లను ఎక్కువసేపు చదివే వారిని సూచించడానికి వాడబడింది. కానీ ఇప్పుడు అది విస్తరించి, నిరంతరంగా ఫోన్ లో స్క్రోల్ చేస్తూ కాలం గడిపే వారందరికీ వర్తిస్తుంది.

ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏమిటి?

మామూలు ఉద్యోగాలకు డిగ్రీలు, అనుభవం అడిగినట్లు కాకుండా, ఈ ఉద్యోగానికి చాలా భిన్నమైన అర్హతలు కోరారు.

  • రోజూ ఆరు గంటలు: అభ్యర్థులు రోజుకు కనీసం ఆరు గంటల పాటు Instagram, YouTube వాడినట్లు స్క్రీన్ షాట్ సాక్ష్యాలను చూపించగలగాలి.
  • కంటెంట్ కల్చర్ పై పట్టు: కొత్తగా వస్తున్న ట్రెండ్స్, క్రియేటర్స్, ఇన్ ఫ్లూయెన్సర్ ల గురించి ఎప్పటికప్పుడు పూర్తి అవగాహన ఉండాలి.
  • Reddit పరిజ్ఞానం: Redditలో ఉన్న InstaCelebsGossip కమ్యూనిటీని ఉదయం పేపర్ లా చదివే అలవాటు తప్పనిసరి.
  • భాషా ప్రావీణ్యం: హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఫ్లూయెన్సీ ఉండాలి.
  • ఇతర నైపుణ్యాలు: Excel వాడటంలో కూడా ఇబ్బంది ఉండకూడదు.

ఉద్యోగ వివరాలు మరియు సోషల్ మీడియా స్పందన

ఈ ఉద్యోగం ముంబైలో ఫుల్ టైమ్ గా ఉంటుంది. జీతం వివరాలను వెల్లడించకపోయినా, “పోటీకి తగ్గ స్థాయిలో పేమెంట్ ఇస్తాం” అని సీఈఓ విరాజ్ శేఠ్ తెలిపారు.

ఈ జాబ్ పోస్టింగ్ లింక్ డిన్ లో పెద్ద హాస్యానికి కారణమైంది. “రోజుకు 19 గంటలు స్క్రోల్ చేస్తే ఓవర్‌క్వాలిఫైడ్ అవుతానా?” అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు. “సోషల్ మీడియా అడిక్ట్ అంటే ఇప్పటివరకు రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు అదే ఫుల్ టైమ్ జాబ్ అయిపోయింది!” అని మరొకరు రాశారు. “స్క్రీన్ టైమ్ ఎక్కువైందని ఇప్పటివరకు నిందించేవారు, కానీ ఇప్పుడు అదే క్వాలిఫికేషన్ అవుతోంది. అద్భుతం!” అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

మొత్తం మీద, ఈ విచిత్రమైన ఉద్యోగం ఒకవైపు ఆశ్చర్యం కలిగించగా, మరోవైపు సోషల్ మీడియా అంటే ఆసక్తి ఉన్న వారికి ఇది నిజంగానే డ్రీమ్ జాబ్ గా మారింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago