Featured

రాక్షస నిజాలు తెలుసుకున్న డాక్టర్ బాబు.. మోనితను చంపేందుకు వెళ్తూ..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1111 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ లో భాగ్యం ఎలాగైనా
మోనితను కిడ్నాప్ చేసి ఈ పెళ్ళి తప్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మోనిత ఇంటికి వెళ్లి మాయ మాటలు చెప్పడంతో భాగ్యం అబద్ధం చెబుతుందని గ్రహించిన మోనిత తననిలో పలికి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి తలపై కొట్టి కుర్చీకి కట్టిపడేస్తుంది. నన్నే మోసం చేస్తావా… నేను కార్తీక్ ను ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరుతాను అంటూ మోనిత అత్యుత్సాహం కనబరుస్తుంది.

ఇక డాక్టర్ బాబు దీప మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్లావు.. ఏమైంది.. అని డాక్టర్ బాబు దీపను అడగడంతో దీప నేను ఏమి చెప్పదలుచుకోలేదు. మీరు నేను చెప్పిన అడ్రస్ కి వెళ్తే చాలు అన్నీ అక్కడే తెలుస్తాయి అంటుంది. అదేదో ఇక్కడే చెప్పచ్చుగా అంటాడు.లేదు డాక్టర్ బాబు మీరు వెళ్లి కేవలం ఆ డోర్ కొట్టండి చాలు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అంటూ డాక్టర్ బాబుకి అడ్రస్ చెబుతుంది. అడ్రస్ తెలుసుకున్న డాక్టర్ బాబు దీప చెప్పిన ఇంటికి వెళ్తాడు.

అప్పటికి అక్కడ మోనిత మనిషి ద్రాక్షారామం.. అంజి మధ్య పెద్ద గొడవ జరిగి అంజి గ్లాస్ బాటిల్ తో ద్రాక్షారామం తల పగల కొడతాడు.అంతలోగా డోర్ కొట్టడంతో ఆ రక్తపు చేతులతోనే తలుపు తీయగా డాక్టర్ బాబు కనపడతాడు. ఆ విధంగా అంజిని చూసేసరికి డాక్టర్ బాబు ..ఈ రౌడీ నా దీప నమ్మింది? అని మనసులో అనుకుంటాడు. డాక్టర్ బాబు దీపమ్మ పంపారా… అంటూ హోటల్ లో దీప వీడియో తీస్తూ తనకు ధైర్యం చెప్పిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు.

డాక్టర్ బాబు మీరు మోనితను నమ్మకండి.. నన్ను నమ్మినా నమ్మక పోయినా పర్వాలేదు ఆ మోనితను నమ్మకండి… ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. దీపమ్మ మాటలు నమ్మండి అంటూ జరిగినవన్నీ చెబుతాడు. అంజి చెప్పే మాటలకు కార్తీక్ నమ్మడు.ఈ విషయాలన్నీ అప్పుడే నాకు చెప్పావు కదా అంటూ ఇక నుంచైనా బుద్ధిగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. ఇక భాగ్యం కనిపించకపోవడంతో దీప తండ్రి మురళి కృష్ణ భాగ్యం గురించి కంగారుపడుతూ ఇంటికి వస్తాడు. తన పిన్ని కనిపించడంలేదని కంగారు పడతాడు.పిన్ని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అంటూ దీప కూడా కంగారు పడుతుంది.

ఇక 25వ తేదీ పెళ్లి కావడంతో కార్తీక్ తండ్రి ఆనందరావు పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నాడు. ఆ సమయంలో ఆదిత్య శ్రావ్య వచ్చి మోనిత మాటలకు అన్నయ్య లొంగడు, ఈ పెళ్ళి జరగదు మీరు టెన్షన్ పడకండి నాన్న అంటాడు. అసలు మీ ఆరోగ్యం బాలేదు మీరు టెన్షన్ పడకూడదు అని డాక్టర్ వర్ధన్ చెప్పారుగా అంటే.. నేనేమైనా విగ్రహమా… టెన్షన్ పడకుండా ఉండటానికి ఇక్కడ నాకే ఇంత టెన్షన్ ఉంటే అక్కడ దీప ఇంకా ఎంత టెన్షన్ పడుతుందో అంటూ దీప గురించి ఆలోచిస్తాడు. ఈ విధంగా కార్తీక్ పెళ్లి గురించి టెన్షన్ పడుతున్న ఆనందరావుకి ఆదిత్య ఓదార్పు ఇస్తాడు.

దీప ఇంట్లో కూర్చొని అంజి దగ్గరికి వెళ్లిన డాక్టర్ బాబు ఇంకా రాలేదు… మరోవైపు పిన్ని ఎక్కడికెళ్ళిందో తెలియదు. అసలు ఏం జరుగుతోంది.ఈ విషయంలో మోనితకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అంటూ ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అమ్మ 25వ తేదీ మమ్మల్ని బయటకు తీసుకు వెళ్తా అన్నావ్ కదా …. గుర్తుందా అంటూ అడుగుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago