ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా చిన్న పిల్లలు చేసే డాన్స్ లు ఎంతో ముద్దు ముద్దుగా ఉంటాయి. వారు పెట్టే క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందరికీ ఎంతగానో నచ్చుతాయి.ఇప్పటికే ఈ విధంగా చిన్న పిల్లలు చేసే డాన్స్ లో సోషల్ మీడియాలో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా “బచ్‌పన్ కా ప్యార్ మేరా” .. అనే పాటను ఓ కుర్రాడు పాడిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాట గత కొద్ది రోజుల వరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి నోటిలో ఈ పాట మారుమోగిపోయింది.తాజాగా ఈ పాటకు ఓ చిన్నారి స్టెప్పులు వేస్తూ ఆ స్టెప్పులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పాట మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు మాత్రమే కాకుండా హావభావాలను వ్యక్తపరుస్తూ చేసిన వీడియోను లిటిల్ ఏంజెల్ తాయ్షా మైనీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు చిన్నారి తాయ్షా స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే డాన్స్ సూపర్ అంటూ కొందరు కామెంట్లు చేయగా… మరి కొందరు పాప లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ పాప స్టెప్పుల ద్వారా “బచ్‌పన్ కా ప్యార్ మేరా”అనే పాట మరోసారి అందరి నోటిలో వినిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…