General News

విపరీతంగా పెరుగుతోన్న వంట నూనె ధరలు.. దీనికి కారణం ఏంటంటే..

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అంటూ ఓ సినిమాలో సాంగ్. అలాంటి పరిస్థితే సామన్యుడికి ఎదురవుతుంది. నిత్యావసర వస్తువుల కోసం భయటకు వెళ్తే చాలు.. ఏ వస్తువు ముట్టుకున్నా చుక్కల్లో ధరలు కనపడుతున్నాయి. పెట్రోల్ , డీజిల్ ధరలు ప్రతి నిత్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు ఫామాయిల్ ధరలు కూడా ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరీ విపరీతంగా కాకుండా రోజుకు కొద్ది మొత్తంలో పెరుగుతుంటంతో ఎవరూ గమనించలేనంత ధరకు చేరకుంది ప్రస్తుత ధర.

అమాంతంగా పెరిగిన ధరల తాకిడిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. వంట నూనెల పెరుగుదలపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించింది. కానీ, ధరలు మాత్రం అదుపులోకి రాలేదు. 6 నెలల క్రితం 90 రూపాయలుగా ఉన్న పామాయిల్ ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా 110 నుంచి 180 రూపాయలకు చేరింది. జులైలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు ప్రకారం… 2020తో పోల్చితే… వంట నూనెల ధరలు… 52 శాతం పెరిగాయి. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావిస్తూ ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

వంట నూనె ధరలు పెరగడానికి గల కారణం కరోనా అని ప్రస్తావించారు. వేరుశనగ నూనె (Groundnut) ధర గత ఏడాది జులైతో పోల్చితే… ఈ ఏడాది జులై నెలలో 19.24 శాతం పెరిగిందని ఆయన అన్నారు. క్రూడ్ పామాయిల్‌పై పన్నును జూన్ 30 నుంచి 5 శాతం తగ్గించింది అని మంత్రి తెలిపారు. అలాగే… రిఫైన్డ్ పామాయిల్ లేదా పామోలిన్ పై పన్నును 45 శాతం తగ్గించి… 37.5 శాతంగా ఉంచామన్నారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి నామమాత్రంగా ఉండటంతో దాని దిగుమతులకు విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఆవ నూనె 39.03 శాతం పెరిగింది… అలాగే సోయా నూనె 48.07 శాతం పెరిగింది… అలాగే సన్‌ఫ్లవర్ నూనె 51.62 శాతం పెరిగింది. పామాయిల్ 44.42 శాతం పెరిగింది. జులై 27 నాటికి ఈ లెక్కలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago