Ex MLA Chukka Pagadalamma : 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేలలో ఏకైక దళిత మహిళా ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుండి ఎన్నకైన సుక్క పగడాలమ్మ గారు ప్రస్తుతం అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఉన్న ఆమె తన హయాంలో రాజకీయ అనుభవాలను అలాగే ఇప్పుడున్న రాజకీయాలకు ఉన్న వత్యాసంను తెలిపారు. అప్పట్లోనే 7500 ఓట్ల అత్యధిక మెజారిటీ తో ప్రత్యర్థి పై గెలిచిన సుక్క పగడాలమ్మ గారు తన రాజకీయ అనుభవాలను యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఇందిరా గారితో ఫోటో మర్చిపోలేను…
మొదటి దళిత ఎమ్మెల్యే అయిన సుక్క పగడాలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీచేసారు. భర్త సహకారంతో ఎన్నికల్లో గెలిచిన పగడాలమ్మ అసెంబ్లీ కి వెళ్ళినపుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు గారు అత్యధిక మెజారిటీతో గెలిచిన మహిళా ఎమ్మెల్యే మీరేనమ్మ అంటూ ప్రశాంసించారట. ఇక ఆయన తరువాత ఒక ఏడాదికే వెంగలరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దాదాపు అసెంబ్లీ 6 సంవత్సరాలు ఉండటం విశేషం. అప్పటికే జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడతో అసెంబ్లీ ఒక ఏడాది అదనంగా ఉందట. ఇక జై ఆంధ్ర సమయంలో ఎమ్మెల్యేలలందరూ ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని కలువగా ఆమె ఎంతో చక్కగా మాట్లాడారు. ఆమెతో ఒక ఫోటో తీసుకోవాలని అడిగితే భుజం మీద చేయి వేసుకుని నాతో ఫోటో తీసుకున్నారు, ఆ సమయంలో అంత స్థాయి లో ఉన్న ఆమె నా మీద చేయి వేసి ఫోటో తీసుకోవడంతో భయమేసింది అంటూ అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఇక నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే అయ్యాక మొదట కరెంటు శాంక్షన్ చేయించుకున్నామని, అలానే రోడ్లు సరిగా లేక ఒరిస్సా మీదుగా వెళ్తుంటే ఒరిస్సా వాళ్ళతో ఇబ్బందులు ఉండటం వల్ల రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం అంటూ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో చేసిన పనులను చెప్పారు . ఎక్కడికి వెళ్లాలన్నా భర్తతో కలిసి బస్ లోనే ప్రయాణం అంటూ చెప్పి ఇపుడు పరిస్థితులు అలా లేవంటూ తెలిపారు. అసెంబ్లీ కి వెళ్లి సంతకం పెడితే రోజూ 40 రూపాయలు ఇచ్చేవరంటూ తెలిపారు. ఇక ఎమ్మెల్యే నెల జీతం 300 రూపాయలు అంటూ తెలిపారు. బస్ లో వెళ్లాలంటే టికెట్ డబ్బులు ఇచ్చేవరంటూ ఇపుడంతా మారిపోయిందంటూ ఒక ఎమ్మెల్యే వెళ్తే వెంట నాలుగు వాహనాల కన్వాయ్ వెళ్తుంది అంటూ అప్పటికి ఇప్పటికీ తేడా తెలిపారు. ప్రస్తుతం ఒక చిన్న ఇంట్లో ఉన్న ఆమె ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఉద్యోగాలు అలా ఇప్పించినవారు ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు అంటూ భర్త బ్రతికున్నంత వరకు ఎపుడైనా ఉత్తరం పంపేవారు చాలా మంది అంటూ తెలిపారు.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…