Nukaraju & Asiya love story : ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వాళ్ళు ఎందరో అయితే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటూ చిన్న చిన్న వేషాలు వేస్తున్నా మంచి గుర్తింపు అందుకుని కెరీర్ లో ఎదిగినవారు ఉన్నారు. జబర్దస్త్ వల్ల అటు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సినిమాల్లో మంచి అవకాశాలను కూడా అందుకుంటున్నారు చాలా మంది కమెడియన్స్. అలా జబర్దస్త్ వచ్చి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నూకరాజు ఒకడు. మొదట పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నూకరాజు ఆ తరువాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇక నూకరాజు తో పాటు ఆసియా కూడా అలానే పటాస్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి ఆ తరవాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కెరీర్ లో బాగానే ఉంది. ఇక వీరిద్దరి క్యూట్ లవ్ స్టోరీ, వారు కెరీర్ లో పడిన కష్టాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
తాను రిజెక్ట్ చేస్తే ఏడ్చేసా…
పటాస్ కి రాకమందు నూకరాజు సెంట్రల్ రైల్వే లో చిన్న ఉద్యోగం చేసేవాడట. అయితే సినిమా, టీవీ రంగం మీద ఉన్న ఆసక్తితో ఆ జాబ్ మానేసి టీవీ ప్రోగ్రామ్స్ చేయడానికి వచ్చేసాడు. నూకరాజు ఆసియా ఇద్దరూ పటాస్ షో నుండి పరిచయమయ్యారు. మొదట నూకరాజు ఆసియాను ఇష్టపడి తన ప్రేమను చెప్పగా ఆసియా రిజెక్ట్ చేసింది. అలా రెండు మూడు సార్లు ప్రపోజ్ చేసినా ఆసియా నో చెప్పడం తో నూకరాజు బాగా ఏడ్చేసాడట. షో అప్పుడు బాత్రూం లోకి వెళ్లి ఏడ్చేసాడట నూకరాజు. ఇక మళ్ళీ ఆసియా కూడా నూకరాజు ప్రేమను అంగీకరించింది.
అయితే ఇద్దరూ తమ కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ క్రమంలోనే నూకరాజు, ఆసియా తో బిజీగా ఉండి ఒక ఆరునెలలు మాట్లాలేదట. ఆ సమయంలో ఆసియా చాలా బాధపడింది అంటూ నూకరాజు సారీ చెప్పి కాళ్ళమీద పడి క్షమాపణలు కూడా చెప్పాడు శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో. ఇక వీరి ప్రేమను పెద్దలు అంగీకరిస్తే 2026 లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని తాను పడిన కష్టం తన పిల్లలు పడకూడదని నూకరాజు భావిస్తున్నాడు. పటాస్ షో తరువాత రెండేళ్లు ఖాళీగా ఉండటంతో ఆసియా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడినా ఇంట్లో వాళ్లకు అవేవీ చెప్పకుండానే ఇబ్బందులు పడి మళ్ళీ జబర్దస్త్ ద్వారా అవకాశం అందుకుంది. ఇక వాళ్ళ కెరీర్ లో పడిన ఇబ్బందులను చెబుతూ నూకరాజు ఆసియా ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. మొదట్లో బాగా ఇబ్బందులు పడినా ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నామంటూ తెలిపారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…
దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…