పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. కానీ పెళ్ళిలో ముఖ్యమైన శారీరక బంధం, భూమిపైనే సాధ్యం.. లైంగిక బంధం సరిగాలేని జంటల్లోని మగవారు లేదా ఆడవాళ్లు తోడును వదిలి వేరొకరితో అక్రమ సంబంధాలను కొనసాగిస్తుంటారు. కానీ ఇలా డబ్బు కోసం కూడా పరాయి వాళ్ల మోజులో పడి వెళ్తుంటారు. ఇలా వెల్లి తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. పక్కింటి మహిళ మోజులో పడిపోయి తన భార్యను, పిల్లలను పట్టించుకోకుండా తనకున్న ఆస్తులను అమ్మి.. అతడు మోజుపడ్డ మహిళకు ఇచ్చేశాడు. ఇంట్లో భార్య, పిల్లలు ఎంత చెప్పినా వినలేదు. దీంతో ఓ రోజు అతడిని కుటుంబసభ్యులే చంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా అచాపుర గ్రామానికి చెందిన వినోద్, బిను భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు.
ఇలా హాయిగా సాగుతున్న వీరి కాపురంలో ఓ మహిళ అతడికి పరిచయం కావడం పెద్ద చిచ్చు పెట్టినట్లు అయింది. ఆమెతో పరిచయం.. కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అంతేకాదు తన ఆస్తులను అమ్మిమరి సదరు మహిళకు డబ్బులివ్వడం ప్రారంభించాడు. ఈ విషయం గురించి వాళ్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఎంత చెప్పినా వినోద్ లో మార్పు రావడంలేదని ఆమె తన ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరి బంధువులతో కలిసి వినోద్ హత్యకు భార్య ప్రణాళికలు రచించింది.
అతడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ ఇనుపతీగను తీసుకొని గొంతకు బిగించి అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు పట్టుకొని గట్టిగా లాగారు. దీంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. ఇక ఆ శవాన్ని కారులో తీసుకెళ్లి అడవిలో కారుతో సహా తగల బెట్టారు. తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులకు అనుమానం రావడంతో మొత్తం బయటకు వచ్చింది. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…