Categories: FeaturedGeneral News

రిలయన్స్ జియోలో వాటా కొన్న పేస్ బుక్ !! అంబానీకి కృతఙ్ఞతలు తెలిపిన మార్క్ జుకెర్ బర్గ్ !

రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫెస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసారు.. 43,574 కోట్లకు ఈ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 4.42 లక్షల కోట్ల విలువగల జియోలో తన వంతు వాటా కొనుగోలుచేయడం వాల్ల ఫెస్బుక్ జియోలోని అతిపెద్ద షేర్ హోల్డర్ గా నిలువనుంది. ఈ సందర్భంగా రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ… 2016 లో దేశవ్యాప్తంగా జియోను సర్వీసులను పారంభించారని, భారత్ ను అతిపెద్ద డిజిటల్ సమాజంగా మార్చేలా జియోను తీర్చిదిద్దాం. ఇప్పుడు ఫెస్ బుక్ ను కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది చాలా గౌరవప్రదమైనది. ఈ డీల్ వాల్ల ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లభ్ది పొందుతారని ఆశిస్తున్నాను అని అన్నారు. మరోవైపు కరోనా తరువాత భారత ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందని, అందుకోసం జియో, ఫెస్బుక్ బంధం మరింతగా ఉపయోగపడుతుందని తెలిపారు ముఖేష్ అంబానీ.

ఈ మేరకు ఫెస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ కూడా తన ఫెస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. భారత్ లో జియోతో ఫెస్ బుక్ జత కట్టింది. ప్రజలు మరియు వ్యాపారం కోసం జియో, ఫెస్బుక్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కొన్ని కీలక ప్రాజెక్టుల్లో ఈ సంస్థలు కలిసి పనిచేయనున్నాయని పేర్కొన్నారు. భారత్ లో డిజిటల్ రంగం అత్యంత వేగంగా పరుగులు తీస్తోందని.. లాక్ డౌన్ సమయంలో చిన్న చిన్న వ్యాపారులు డిజిటల్ వ్యవహారాలపై చూస్తున్నారని అంటువంటి వారికీ జియో సహాయం చేస్తోందని.. ఫెస్బుక్ తో జతకట్టినందుకు ముఖేష్ అంబానీకి కృతఙ్ఞతలు.. జియో టీం కి కూడా అంటూ పోస్ట్ చేసారు.

2016లో దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్ జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లోకి టాప్ లోకి దూసుకు వచ్చింది. మొబైల్ టెలికాంతోపాటు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఇకామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది. అంతేకాదు యుఎస్ టెక్ గ్రూపులతో పోటీ పడగల ఏకైక సంస్థగా రిలయన్స్ అవతరించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

6 minutes ago

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

36 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

1 hour ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

1 hour ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

1 hour ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

1 hour ago