బాల నటుడిగా ప్రారంభమైన బాలకృష్ణ సినీ ప్రస్థానం 1984 వచ్చేసరికి కోడి రామకృష్ణ, బాలకృష్ణ మొదటి కాంబినేషన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా తో బాలకృష్ణకు మాస్ ఇమేజ్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా బ్లాక్బస్టర్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇద్దరి కలయికలో రెండవ చిత్రంగా బాలకృష్ణ విజయశాంతి, రాధ కలయికలో ముద్దుల కృష్ణయ్య విడుదలయ్యింది. మూడవ చిత్రంగా బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో మువ్వ గోపాలుడు సినిమా వచ్చింది.
ఇదే కలయిక లో నాలుగవ చిత్రంగా బాలకృష్ణ, భానుప్రియ కాంబినేషన్ లో భారతంలో బాలచంద్రుడు సినిమా వచ్చింది. ఆ తర్వాత ఐదవ చిత్రంగా బాలకృష్ణ, విజయశాంతి నటించిన ముద్దుల మామయ్య సినిమా వచ్చింది. ఈ కలయిక లో ఆ తర్వాత ఆరో చిత్రంగా బాలకృష్ణ, సుహాసిని కాంబినేషన్ లో బాల గోపాలుడు చిత్రం వచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో ఏడవ చిత్రంగా ముద్దుల మేనల్లుడు సినిమా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 90% హిట్ సినిమాలు వచ్చాయి. భారతంలో బాలచంద్రుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వీరి కాంబినేషన్ లో మంగమ్మగారి మనవడు అదేవిధంగా ముద్దుల మావయ్య చిత్రాలు అత్యద్భుతమైన విజయాన్ని సాధించాయి.
ఎనిమిదో చిత్రంగా కోడి రామకృష్ణ బాలకృష్ణ కాంబినేషన్ లో విక్రమ సింహ భూపతి దాదాపు సగం షూటింగ్ పూర్తయిన తర్వాత భార్గవ్ ఆర్ట్స్ అధినేత అనగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చనిపోవడంతో విక్రమ సింహ భూపతి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ఈ సినిమాని పూర్తి చేయలేక పోయాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి భార్గవ్ రెడ్డి కూడా అకాల మరణం చెందారు. అలా తెలుగు సినీ చరిత్రలో కొన్ని విడదీయరాని కాంబినేషన్స్ అత్యద్భుతమైన విజయాలను సినీ పరిశ్రమకు అందించడం జరిగింది. కోడి రామకృష్ణ, బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ ముద్దుల మామయ్య లాంటి సినిమా మళ్లీ రావాలని బాలకృష్ణ అభిమానులు కోరుకున్నారు..
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…