Categories: FeaturedHealth News

బోడకాకరకాయతో ఎన్నో ఔషధ గుణాలు.. ఎన్నో లాభాలు?

సహజసిద్ధంగా చాలా అరుదుగా లభించే కూరగాయల్లో బోడకాకర కాయ ప్రధానమైంది.సాధారణంగా బోడకాకర కాయలు వర్షాకాలం తొలకరి వర్షాలు పడినప్పుడు కొన్ని అటవీ ప్రాంతాల్లో లభ్యమవుతాయి. అందుకే వీటిని అడవి కాకరకాయలు అని కూడా అంటారు.ఇతర కూరగాయాలతో పోలిస్తే బోడకాకర కాయలలో అద్బుతమైన ఔషధగుణాలతో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.

మన భారతీయ ఆయుర్వేద చికిత్సలో ఎన్నో వ్యాధులకు బోడకాకరకాయ మరియు ఈ మొక్క ఆకులు, పేర్లు,పువ్వులు ఎన్నో ఔషధ గుణాలు కలిగి అనేక వ్యాధులకు పరిష్కార మార్గంగా ఉంది.బోడకాకర కాయలో విటమిన్ ఎ, బి,సి లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు చర్మ సమస్యలు తొలగి మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి సమృద్ధిగా లభిస్తుంది.

బోడ కాకరకాయలో క్యాన్సర్ కణాలతో పోరాడే పైటో న్యూట్రియంట్స్ ఉండడంతో మన శరీరంలోని క్యాన్సర్ కారకాలను నాశనం చేసి క్యాన్సర్ ప్రమాదాన్ని తొలగిస్తుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపరిచి మలబద్దకం,అజీర్ణం పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గించి ఇన్సులిన్ లెవల్స్ నీ నియంత్రించి ప్రమాదకర డయాబెటిస్ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించిగుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో బోడ కాకరకాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ బోడ కాకరకాయ లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago