Categories: General News

ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 20 వాహనాలు ధ్వంసం! నుజ్జు నుజ్జయిన వాహనాలు..

మహారాష్ట్ర, పుణే జిల్లా: మహారాష్ట్రలోని పుణే జిల్లా వద్ద ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ ఎంట్రీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మంది వరకు గాయపడ్డారు.

Fatal road accident on the Mumbai – Pune express highway.. 20 vehicles collided!

ప్రమాద వివరాలు, కారణం

వివరాల్లోకి వెళితే, లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద ఓ కంటైనర్ వాహనానికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. నియంత్రణ తప్పిన ఆ భారీ వాహనం ముందున్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. పలు కార్లు, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

సహాయక చర్యలు, ట్రాఫిక్ జామ్

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రయాణికులు ఇలాంటి ఘటనలు రీపీట్ కాకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago