Categories: FeaturedMovie News

Fight Masters Ram Lakshman : చిరంజీవి, బాలయ్య షాట్ కట్ అనగానే క్యారవాన్ లోకి వెళ్లరు.. అందుకే ఇప్పటికీ సినీ పరిశ్రమకు రెండు పిల్లర్స్ గా ఉన్నారు. : రామ్ లక్ష్మణ్.

Fight Masters Ram Lakshman : ఇప్పుడే కాదు సంక్రాంతి పండగకు ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు. సంక్రాంతి బరిలో ఆ ఇద్దరిలో ఎవరు నెగ్గారు. ఎవరు తగ్గారు అనేది వేరే అంశం. వీరి సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయంటే తెలుగు ప్రేక్షకుల హంగామా అంతా ఇంతా కాదు… అయితే ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి, వీర సింహారెడ్డిగా బాలయ్య అభిమానులను అలరించడానికి షూటింగ్ పూర్తిచేసుకుని సంసిద్ధంగా ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విడుదలబోతున్న ఈ రెండు చిత్రాలకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా చేస్తున్నారు. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…

తాము సినీ పరిశ్రమకు వచ్చి చాలా సంవత్సరాలవుతుందని.. ఆ కళామతల్లి ఆదరించడం వలన ఈ పరిశ్రమలో కొనసాగుతున్నామని ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. అలాగే దర్శక నిర్మాతలు మా ప్రతిభను గుర్తించి మాకు అవకాశాలు ఇస్తున్నారు. యాంకర్ సంక్రాంతికి విడుదల అవబోతున్న వాల్తేరువీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల గురించి ప్రస్తావించినప్పుడు… ఆరుపదుల వయసు దాటిన చిరంజీవి, బాలయ్య ఇంకా ఎనర్జిటిక్ గా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని. అయితే వారిద్దరికి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్, డెడికేషన్ ఒకేలాగా ఉంటుందని..

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఫైటింగ్ చేస్తున్నప్పుడు చివరిగా.. అన్నయ్య చిరంజీవి వస్తారు. అయితే ముందుగా ఆయనను రమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని షూటింగ్ కి టు అవర్స్ లేటుగా రమ్మన్నాం. కానీ అన్నయ్య చిరంజీవి తన కోసం ఎదురుచూడడం ఎందుకని వన్ అవర్ ముందుగానే లొకేషన్ కు వచ్చారు. అన్నయ్య చిరంజీవి షాట్ రెడీ అనగానే వచ్చి ఫైట్ సీన్స్ లో పాల్గొనడం జరిగింది. షాట్ కట్ అయిన తర్వాత కూడా లొకేషన్ లో ఉంటూ తదుపరి జరగబోయే సీన్స్ లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే బాలయ్య కూడా అంతే వర్క్ పట్ల అంతే కమిట్మెంట్ తో పనిచేస్తారు. షాట్ కట్ అన్న తర్వాత కూడా వారికి కేటాయించిన క్యారవాన్ లోకి వెళ్లకుండా అందరితో కలిసి సినిమా సెట్ లోనే ఉంటారు.

అన్నయ్య చిరంజీవి, బాలయ్యబాబు ఇద్దరు కూడా లంచ్ వరకు సెట్ లోనే ఉంటూ లంచ్ సమయంలో మాత్రం కారవాన్ లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు వస్తున్న నటీనటులు షాట్ కట్ అనగానే కారవాన్ లో వెళ్లి కూర్చుంటున్నారు. చిరంజీవి, బాలయ్య ఆ పద్ధతులు పాటించడం వల్లనే వారు ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందుకే తెలుగు ప్రజలు వారిని ఇంకా అభిమానిస్తూనే ఉన్నారంటూ.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago