ఇటీవల విడుదలైన “ఎస్.ఆర్ కళ్యాణమండపం” మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ రావడంతో ఆ చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. సినిమా విమర్షకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. దీంతో అందులో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ గారితో ఆ చిత్ర యూనిట్ చిన్న ఇంటర్వ్యూ పెట్టారు. అందులో అతడు మాట్లాడుతూ.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా మెగస్టార్ చిరంజీవి ఆ స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదన్నాడు.
హీరో వెంకటేష్ ,నాగార్జున లాంటి వారు కూడా సినిమా సినిమాకి మెచూరిటీ పెంచుకుంటూ వచ్చారని గుర్తుకు చేశాడు. అయితే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన వారి బ్లడ్ లోనే ఉందన్నారు. యాక్షన్ చేసే సమయంలో నందమూరి హీరోలు భయపడటం తాను ఏనాడు చూడలదేని.. ఏమాత్రం భయం లేకుండా అలవోకగా ఏ సీన్ అయినా నటిస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. నందమూరి హీరోలందరితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.
సీనియర్ ఎన్టీఆర్ తో తను చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా విషయాలు కూడా ఈ సందర్బంగా పంచుకున్నాడు సాయికుమార్. ఆ సినిమలోని ఓ సీన్ గురించి అతడు ఈ సందర్భంగా చెప్పడు. ఎన్టీఆర్ తనని కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంది.. అయితే ఎన్టీఆర్ వెంటనే లేచి వీడు ఎంత నాకు పిచ్చుక లాంటి వాడు అని చెప్పి ఒక్క దెబ్బతో నన్ను కింద పడగొట్టేసాడు అని అతడు చెప్పాడు.
70 ఏళ్ల వయస్సులో కూడా ఎలాంటి డూప్ లు లేకుండా స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ ట్రాక్టర్ పైనుంచి దూకి విల్లన్ ను కొట్టే ఫైట్ సీన్ ను చేయడం చూసి నిజంగా చాలా ఆశ్చర్య పోయానని సాయి కుమార్ చెప్పాడు. ఇంత గొప్ప నుటల మధ్యలో చిరంజీవి గారు కూడా తన పేరును రాసుకున్నారని.. నిజంగా అన్నయ్య చాలా గ్రేట్ అంటూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సాయికుమార్ బయటపెట్టాడు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…