బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అటు బుల్లితెర ఇటు వెండితెరలో సమాన క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. రంగస్థలంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో ఎంతో ఫేమ్ తెచ్చుకున్నారు.
ముప్పై సంవత్సరాల వయస్సులో, ఆమె గొప్ప ఆఫర్‌లను పొందడం ద్వారా హీరోయిన్లతో పోటీపడుతుంది. ఇప్పటికే తమిళం మరియు మలయాళంలో సినిమాలు చేస్తున్న ఈమెకు హీరోయిన్స్ లాగే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు. అయితే అనసూయది ప్రేమ వివాహం అని ఆమె చాలా సార్లు చెప్పింది. అయితే అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.
ఆమె కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది అనసూయ. ఇక వారికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త ఫైనాన్షియర్ మరియు ఫండింగ్ ప్లానర్ అని ఒక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది.
గతంలో అనసూయ తన భర్తను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం కూడా చేసింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో తాను మొదట్లో బాధపడ్డానని, అయితే తన ఇంటి సహాయంతో, ముఖ్యంగా తన భర్త సహాయంతో వాటిని అధిగమించానని ఆమె పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. అనసూయ పుష్పలో కూడా ఒక పాత్రను పోషిస్తుంది. ఆమె నటుడు సునీల్‌కు భార్యగా కనిపించనుంది. ఇవి మాత్రమే కాదు యాంకర్ అనసూయ మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…